The Family Man 2 లో నటించడం వెనుక అసలు కారణం చెప్పిన Samantha.. సౌత్ దర్శకులు క్యూట్‌గానే చూపించారంటూనే..

ABN , First Publish Date - 2022-07-22T16:24:46+05:30 IST

టాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్స్‌లో సమంత (Samantha) ఒకరు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో..

The Family Man 2 లో నటించడం వెనుక అసలు కారణం చెప్పిన Samantha.. సౌత్ దర్శకులు క్యూట్‌గానే చూపించారంటూనే..

టాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్స్‌లో సమంత (Samantha) ఒకరు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమైన ‘ఫ్యామిలీ మ్యాన్ 2’తో సమంత దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సాధించింది. ఆ తర్వాత ‘పుష్ప’లో చేసిన ‘ఊ అంటావా’ ఐటమ్ సాంగ్‌తో ఆ పాపులారిటీని ఇంకా పెంచుకుంది. అంతేకాకుండా త్వరలో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ బ్యూటీ తాజాగా హిందీలో పాపులర్ షో ‘కాఫీ విత్ కరణ్ (Koffee With Karan)’కి అక్షయ్ కుమార్‌తో కలిసి గెస్ట్‌గా వెళ్లింది. ఈ షోలో హోస్ట్ కరణ్ జోహార్ (Karan Johar) అడిగిన పలు పశ్నలకు సమంత ఆసక్తికర సమాధానాలు తెలిపింది.


వెబ్ సిరీస్‌పై సంతకం చేయడానికి ముందు రాజ్, డికెతో మీకు అప్పటికే పరిచయం ఉందా అని కరణ్ అడిగాడు. దానికి సమంత రిప్లై ఇస్తూ.. ‘లేదు. రాజ్, డికె నాకు అస్సలు తెలియదు. అప్పటికి ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 కూడా విడుదల కాలేదు. కానీ.. అప్పటికే సీజన్ 2 షూటింగ్ ప్రారంభమైంది’ అని చెప్పుకొచ్చింది.


సమంత ఇంకా మాట్లాడుతూ.. ‘దక్షిణాదిలో చాలామంది దర్శకులు బబ్లీగా, క్యూట్‌గా ఉండే పాత్రల్లో చూశారు. అలాంటి క్యారెక్టర్స్‌నే నాకు ఆఫర్ చేసేవారు. నేను ఇలాంటి టైప్ కాస్ట్ ఇమేజ్‌ని మార్చాలని అనుకున్నా. రాజ్, డికే నాలో ఏం చూశారో తెలియదు. కానీ.. సరైన సమయంలో రాజ్, డికే ఈ పాత్రతో నా దగ్గరకి వచ్చారు. అందుకే ఒప్పుకున్నా. అయితే వారు నన్ను క్యూట్‌గా చూపిస్తూనే.. నా ఆలోచనలకు తగ్గట్లు రఫ్‌గా కూడా చూపించారు’ అని చెప్పింది. కాగా.. సమంత ప్రస్తుతం ‘యశోద’ అనే హార్రర్ మూవీ చేస్తోంది. శాకుంతలం అనే పిరియాడిక్ మూవీ చేస్తోంది.

Updated Date - 2022-07-22T16:24:46+05:30 IST