Samnatha: ఇంకెన్ని రోజులు ఇలాగే ఉంటారు గయ్స్‌!

ABN , First Publish Date - 2022-06-21T17:05:53+05:30 IST

"ఒక అమ్మాయి మీద గాసిప్‌ వేస్త... నిజమే కావచ్చు అనుకుంటారు.. అదే.. అబ్బాయి మీద వదంతులు వస్తే ఒక అమ్మాయి కావాలని చేయించింది అంటారు.. ఇంకెన్ని రోజులు ఇలాగే ఉంటారు గయ్స్‌... ఎదగండి’’ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు సమంత. తాజాగా ఆమెపై జరిగిన ట్రోలింగ్‌ దీనికి కారణం. అసలు విషయం ఏంటంటే...

Samnatha: ఇంకెన్ని రోజులు ఇలాగే ఉంటారు గయ్స్‌!

"ఒక అమ్మాయి మీద గాసిప్‌ వస్తే .. నిజమే కావచ్చు అనుకుంటారు..

అదే.. అబ్బాయి మీద వదంతులు వస్తే ఒక అమ్మాయి కావాలని చేయించింది అంటారు..

ఇంకెన్ని రోజులు ఇలాగే ఉంటారు గయ్స్‌... ఎదగండి’’ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు సమంత. తాజాగా ఆమెపై జరిగిన ట్రోలింగ్‌ దీనికి కారణం. అసలు విషయం ఏంటంటే... (Samantha reaction)


అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం కొన్నాళ్లుగా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా వైరల్‌ అయింది. ఒక అండర్‌ స్టాండింగ్‌తో విడిపోయిన ఈ జంట ఎక్కడా కూడా ఒకరి మీద ఒకరు కామెంట్లు చేసుకోలేదు. అభిమానులు మితిమీరిన అత్యుత్సాహంతో చేసిన ట్రోలింగ్‌ వల్ల ఒకసారి మాత్రం సమంత క్లారిటీ ఇచ్చారు. దాంతో ఈ గొడవ కాస్త సర్దుమణిగింది. తాజాగా మరోసారి చై–సామ్‌ల గురించి వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. హీరోయిన్‌ శోభితా దూళిపాలతో నాగచైతన్య డేటింగ్‌లో ఉన్నారనే వార్త రెండ్రోజులుగా వైరల్‌ అవుతోంది. ఈ గాసిప్‌ వెనుక సమంత హస్తం ఉందని కొందరి మాట. కావాలనే సమంత పీఆర్‌టీ టీమ్‌ నాగచైతన్యపై గాసిప్పులు క్రియేట్‌ చేస్తున్నారని ఓ పోర్టల్‌ వార్తను ప్రచారం చేసింది. ఆ వార్తను ట్యాగ్‌ చేసి ట్విట్టర్‌ వేదికగా సమంత స్పందించారు. (Naga chaitanya)


‘ఒక అమ్మాయి మీద గాసిప్‌ వస్తే... నిజమే కావచ్చు అనుకుంటారు..

అదే.. అబ్బాయి మీద వదంతులు వస్తే ఒక అమ్మాయి కావాలని చేయించింది అంటారు.

ఇంకెన్ని రోజులు ఇలాగే ఉంటారు గయ్స్‌... ఎదగండి...

జరిగిన విషయాన్ని మర్చిపోయి ఇద్దరూ జీవితంలో ముందుకు వెళుతున్నారు. 

మీరు కూడా మీ పని మీద దృష్టి పెట్టండి. 

మీ కుటుంబం మీద దృష్టి పెట్టంచి.. ముందుకు సాగండి’ అని సమంత కాస్త ఘాటుగానే స్పందించారు. (Samantha clarity)





Updated Date - 2022-06-21T17:05:53+05:30 IST