అలియాకి సమంత పుట్టినరోజు శుభాకాంక్షలు.. నువ్వు చేయలేనిది ఉందా అంటూ..

ABN , First Publish Date - 2022-03-15T18:50:40+05:30 IST

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న అలియాభట్ ఈ రోజు (మార్చి 15) పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే...

అలియాకి సమంత పుట్టినరోజు శుభాకాంక్షలు.. నువ్వు చేయలేనిది ఉందా అంటూ..

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న అలియాభట్ ఈ రోజు (మార్చి 15) పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ బ్యూటీకి సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. తాజాగా టాలీవుడ్ నటి సమంత సైతం ఆ భామకి బర్త్ డే విషెస్ చెప్పింది.


సమంత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు అలియాభట్. నువ్వు చేయలేనిది ఏదైనా ఉందా?. నీ విజయాలన్నింటినీ సెలబ్రేట్ చేసుకోవడానికి వెయిట్ చేయలేను. అయినా నువ్వు ఇప్పుడే కెరీర్ ప్రారంభించావని మాకు తెలుసు’ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన వారి అభిమానులు వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. ఫ్యాన్స్ సైతం అలియాకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.



Updated Date - 2022-03-15T18:50:40+05:30 IST