‘No Entry 2’ లోకి సామ్ ఎంట్రీ ?

ABN , First Publish Date - 2022-06-22T19:26:41+05:30 IST

నాగచైన్యతతో విడిపోయిన తర్వాత సమంతాకి టాలీవుడ్ లోనే కాదు, అసలు ఏ వుడ్లోనూ అవకాశాలు రావేమోనని అనుకున్నారు. అయితే అందరి అంచనాల్ని తల్లకిందులు చేస్తూ.. సామ్ తన కెరీర్‌లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టుకుంటూ.. మరోపక్క పాన్ ఇండియా చిత్రాల్నీ అంగీకరిస్తూ.. ఒక పద్ధతి ప్రకారం వెళుతోంది.

‘No Entry 2’ లోకి సామ్ ఎంట్రీ ?

నాగచైతన్య(Nagachaitanya)తో విడిపోయిన తర్వాత సమంతా (Samantha) కి టాలీవుడ్ లోనే కాదు, అసలు ఏ వుడ్లోనూ అవకాశాలు రావేమోనని అనుకున్నారు. అయితే అందరి అంచనాల్ని తల్లకిందులు చేస్తూ.. సామ్ తన కెరీర్‌లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టుకుంటూ.. మరోపక్క పాన్ ఇండియా చిత్రాల్నీ అంగీకరిస్తూ.. ఒక పద్ధతి ప్రకారం వెళుతోంది. ‘ఫ్యామిలీ మేన్ 2 ’ (Familyman 2) వెబ్ సిరీస్ తో ఆల్రెడీ బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది సామ్. దానికి తోడు ‘పుష్ప’  (Pushpa ) చిత్రంలోని ప్రత్యేకపాటతోనూ మరింతగా పాపులరైంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఇప్పుడు ఓ బడా బాలీవుడ్ మూవీలో కథానాయికగా అవకాశమొచ్చినట్టు టాక్.  ఏకంగా సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (salmankhan) సరసన కథానాయికగా ఛాన్స్ కొట్టేసిందట అమ్మడు. 


బాలీవుడ్‌లో సూపర్ హిట్టైన ‘నో ఎంట్రీ’ (No Entry) చిత్రానికి సీక్వెల్ తీసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. 2005లో వచ్చిన ఈ సినిమాను అనీజ్ బజ్మీ (Aneez Bazmee) దర్శకత్వం వహించాడు. బోనీ కపూర్ (Boney kapoor) నిర్మించిన ఈ మూవీలో సల్మాన్ ఖాన్,  అనీల్ కపూర్ (Anil Kapoor), ఫర్తీన్ ఖాన్ (Fardeen Khan) హీరోలుగా నటించగా..  బిపాసాబసు, ఇషా డియోల్, లారా దత్తా, సెలీనా జైట్లీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. యస్వీ కృష్ణారెడ్డి (SV Krishna Reddy) దర్శకత్వంలో తెలుగులో వచ్చిన సూపర్ హిట్ ‘పెళ్ళాం ఊరెళితే’ (Pellam Urelithe) చిత్రానికిది హిందీ వెర్షన్. నిజానికిది తమిళంలో సూపర్ హిట్టైన చార్లీ చాప్లిన్ (Charli Chaplin) కు అఫీషియల్ రీమేక్. ఇదే చిత్రాన్ని తెలుగులోనూ, మలయాళంలోనూ, హిందీలోనూ రీమేక్ చేశారు. ఈ క్రమంలో ఈ సినిమాకిప్పుడు సీక్వెల్ తీయనుండడం విశేషమని చెప్పాలి. 


‘నో ఎంట్రీ 2’ (No Entry 2) గా రాబోతున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన సమంతా కథానాయికా నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. సీక్వెల్ లో కూడా అనిల్ కపూర్, ఫర్తీన్ ఖాన్ పాత్రలు కొనసాగబోతున్నాయి. ఇంకా ఇందులో పదిమంది సీనియర్ హీరోయిన్స్ నటించబోతున్నట్టు వినికిడి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తు్న్న ‘టైగర్ 3’ (Tiger 3) షూటింగ్ కంప్లీట్ అయ్యాకా.. ‘నో ఎంట్రీ 2’ షూటింగ్ లో పాల్లొంటాడట సల్లూభాయ్. తొలిసారిగా బాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇవ్వనున్న సామ్ కు ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్‌నిస్తుందో చూడాలి.  

Updated Date - 2022-06-22T19:26:41+05:30 IST