Samantha: ఆ సమస్యలతో ఇబ్బంది పడుతోందా?

ABN , First Publish Date - 2022-09-22T05:05:20+05:30 IST

సమంతకు ఏమైంది? (Samantha) ఎక్కడా కనిపించడం లేదు.. సోషల్‌ మీడియాలో కూడా యాక్టివ్‌గా లేదు.. కనీసం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల అప్‌డేట్‌ కూడా ఆమె నుంచి రావడం లేదు..

Samantha:  ఆ సమస్యలతో ఇబ్బంది పడుతోందా?

సమంతకు ఏమైంది? (Samantha)

ఎక్కడా కనిపించడం లేదు.. 

సోషల్‌ మీడియాలో కూడా యాక్టివ్‌గా లేదు.. 

కనీసం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల అప్‌డేట్‌ కూడా ఆమె నుంచి రావడం లేదు..

అంతా బాగానే ఉందా.. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోందా? (Samantha health)

ప్రస్తుతం సమంత గురించి నెట్టింట, మీడియాలో జరుగుతున్న చర్చ ఇది. గత నెల రోజులుగా కూడా ఎక్కడా చూసినా సమంత గురించి ఇదే మాట. ఆమె అనారోగ్యం పాలయ్యారంటూ, చర్మ వ్యాధితో బాధపడుతున్నారని వార్తలొచ్చాయి. అయితే తాజాగా దీనిపై సమంత మేనేజర్‌  (Samantha manager)స్పందించారు. ఓ మీడియా సంస్థ సమంత మేనేజర్‌ను సంప్రదించగా ‘ఆ వార్తల్లో నిజం లేదని’ ఆయన చెప్పుకొచ్చారు. సమంత ఆరోగ్యంగా ఉన్నారనీ, ఎలాంటి అనారోగ్య సమస్య లేదని స్పష్టం చేశారు. చర్మ వ్యాధికి సంబంధించిన చికిత్స కోసం సమంత అమెరికా వెళ్తున్నారని తాజాగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. దానిపై సమంత వ్యక్తిగత సిబ్బంది స్పందించలేదు. ప్రస్తుతం సమంత ‘శాకుంతలం’(Shakuntalam), ‘యశోద’, ‘ఖుషి(Kushi)’ చిత్రాల్లో నటిస్తున్నారు. 


Updated Date - 2022-09-22T05:05:20+05:30 IST