ఈ మధ్య హాలీవుడ్‌లో ‘విషయం’ తగ్గిపోతోంది : Samantha

ABN , First Publish Date - 2022-01-03T23:25:26+05:30 IST

‘‘ప్రస్తుతం హాలీవుడ్‌లో చాలా రీమేక్స్, ఫ్రాంఛైజెస్ ఉన్నాయి. అవన్నీ దాదాపుగా దర్శకనిర్మాతలు రీమిక్స్ చేయటం వల్ల పుడుతున్నవే. ఒక టైటిల్ తీసుకుంటారు, కొత్త కాస్ట్ లేదా పాత తారాగణమే, ఇంకా కొత్తదనం ఎకడ్నుంచీ వస్తుంది?’’ అంటోంది సమంత...

ఈ మధ్య హాలీవుడ్‌లో ‘విషయం’ తగ్గిపోతోంది : Samantha

‘సీఎస్ఐ : ఎన్‌వై’, ‘హవాయి ఫై-ఓ’ లాంటి పాప్యులర్ షోస్‌లో అలరించిన అమెరికన్ యాక్ట్రస్ సమంత లాక్‌వుడ్. మంచి సత్తా ఉన్న పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఆమె హాలీవుడ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మధ్య హాలీవుడ్‌లో అసలు ఒరిజినల్ కంటెంట్ రావటం లేదని ముక్కుసూటిగా చెప్పేసింది. 


‘‘ప్రస్తుతం హాలీవుడ్‌లో చాలా రీమేక్స్, ఫ్రాంఛైజెస్ ఉన్నాయి. అవన్నీ దాదాపుగా దర్శకనిర్మాతలు రీమిక్స్ చేయటం వల్ల పుడుతున్నవే. ఒక టైటిల్ తీసుకుంటారు, కొత్త కాస్ట్ లేదా పాత తారాగణమే, ఇంకా కొత్తదనం ఎకడ్నుంచీ వస్తుంది?’’ అంటోంది సమంత. అయితే, ఈ 39 ఏళ్ల హాలీవుడ్ బ్యూటీ కథలో కొస మెరుపు ఏంటంటే... సమంత రైట్ నౌ... బాలీవుడ్‌పై కన్నేసింది. రీసెంట్‌గా ముంబైలో ల్యాండై బీ-టౌన్ ప్రొడక్షన్ హౌజెస్‌ను చుట్టేసింది. త్వరలోనే సమంత లాక్‌వుడ్ ఏదో ఒక హిందీ మూవీలోగానీ, వెబ్ సిరీస్‌లోగానీ కనిపించవచ్చు. చూద్దాం... హాలీవుడ్‌లో విషయం తగ్గిందంటోన్న అమెరికన్ బేబీ బాలీవుడ్‌లో ఎంత వరకూ సక్సెస్ అవుతుందో...

Updated Date - 2022-01-03T23:25:26+05:30 IST