‘కృష్ణ వ్రింద విహారి’: సమంత వదిలిన పాట సందడి చేస్తోంది

ABN , First Publish Date - 2022-04-10T00:13:12+05:30 IST

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై.. నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్ర మ్యూజికల్ జర్నీని చిత్రయూనిట్ స్టార్ట్ చేసింది. ఈ చిత్రంలోని

‘కృష్ణ వ్రింద విహారి’: సమంత వదిలిన పాట సందడి చేస్తోంది

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై.. నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్ర మ్యూజికల్ జర్నీని చిత్రయూనిట్ స్టార్ట్ చేసింది. ఈ చిత్రంలోని ‘వర్షంలో వెన్నెల్లా’ అని సాగే ఫస్ట్ సింగిల్‌ను శనివారం సౌత్ క్వీన్ సమంత విడుదల చేసి.. ‘పాట చాలా అందంగా ఉంది.. టీమ్‌కు నా శుభాకాంక్షలు’ అని తెలిపారు. ఈ పాటలో నాగ శౌర్య, షిర్లీ సెటియా మధ్య కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది. పాటని కూల్ అండ్ రొమాంటిక్‌గా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.


మహతి స్వరసాగర్ స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి అందించిన సాహిత్యం కూడా వర్షంలో వెన్నెలంతా హాయిగా వుంది. పాట పాడిన సంజన కల్మంజే, ఆదిత్య ఆర్కే ఇద్దరూ తమ వాయిస్‌తో మెస్మరైజ్ చేశారు. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీతో పాటు పాటలో విజువల్స్ లావిష్‌గా ఉన్నాయి. ఈ పాటతో ‘కృష్ణ వ్రింద విహారి' సంగీత ప్రయాణాన్ని మేకర్స్ గ్రాండ్‌గా ప్రారంభించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా విడుదలైన పాట కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. కాగా ఈ సినిమాలో సీనియర్ నటి రాధిక ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.



Updated Date - 2022-04-10T00:13:12+05:30 IST