Samantha: ఆసక్తికరంగా 'యశోద' ఫస్ట్ గ్లింప్స్..

ABN , First Publish Date - 2022-05-05T18:47:10+05:30 IST

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'యశోద' (Yashoda). తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను వదిలింది చిత్రబృందం.

Samantha: ఆసక్తికరంగా 'యశోద' ఫస్ట్ గ్లింప్స్..

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'యశోద' (Yashoda). తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను వదిలింది చిత్రబృందం. ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో ఒక్క డైలాగ్ లేకపోయినా కేవలం విజువల్స్, సమంత లుక్స్, మణిశర్మ బీజీఎంతో ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఇక తాజాగా గ్లింప్స్ చూస్తే సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో 'యశోద' చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు అర్థమవుతోంది. కాగా, హరి - హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఆగస్టు 12న పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల చేయబోతున్నారు. 



Updated Date - 2022-05-05T18:47:10+05:30 IST