‘ఊ అంటావా మావా’ సాంగ్‌పై మరోసారి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-03-12T02:20:15+05:30 IST

‘పుష్ప’ సినిమాలో తను చేసిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావా’పై సమంత మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు ఈ సినిమా విడుదల తర్వాత ఈ పాట విషయంలో తను హ్యాపీగా ఉన్నట్లుగా తెలిపిన సమంత..

‘ఊ అంటావా మావా’ సాంగ్‌పై మరోసారి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

‘పుష్ప’ సినిమాలో తను చేసిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావా’పై సమంత మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు ఈ సినిమా విడుదల తర్వాత ఈ పాట విషయంలో తను హ్యాపీగా ఉన్నట్లుగా తెలిపిన సమంత.. ఇప్పుడు ఈ పాటకు ఇంత భారీ స్థాయిలో ఆదరణ లభిస్తుందని అస్సలు ఊహించలేదని తెలిపింది. తాజాగా క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డుల ఫంక్షన్‌కు హాజరైన సమంత వద్ద.. పాత్రికేయులు కొందరు ఈ పాట గురించి ప్రస్తావించగా.. సమంత ఇలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


‘‘పుష్ప సినిమాలో నేను చేసిన ‘ఊ అంటావా మావా’ సాంగ్‌కు ఈ స్థాయిలో స్పందన వస్తుందని ఊహించలేదు. దేశ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. నేను ఇది కేవలం తెలుగు పాటగానే భావించాను.. కానీ పాన్ ఇండియా స్థాయిలో ఈ పాటకి క్రేజ్ వచ్చింది. నేను ఎక్కడికి వెళ్లినా.. ఇంతకు ముందు నేను చేసిన సినిమాల ప్రస్తావన రావడం లేదు. ‘ఊ అంటావా మావా’ పాటలో మీరు బాగా చేశారంటూ చెబుతున్నారు. అలా చెబుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది..’’ అని సమంత అన్నారు. కాగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం ‘పుష్ప2’కి సంబంధించిన షూటింగ్‌పై చర్చలు నడుస్తున్నాయి. అతి త్వరలోనే ఈ షూటింగ్ మొదలుకానుంది.  



Updated Date - 2022-03-12T02:20:15+05:30 IST