Samantha: అమెరికాలో సమంత ఏం చేస్తోంది?

ABN , First Publish Date - 2022-09-18T19:16:15+05:30 IST

సమంత రుతు ప్రభు (Samantha Ruth Prabhu) నెల రోజుల నుండి ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. ఆమెకి ఏమయిందో కూడా తెలియదు...

Samantha: అమెరికాలో సమంత ఏం చేస్తోంది?

సమంత రుతు ప్రభు (Samantha Ruth Prabhu) నెల రోజుల నుండి ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. ఆమెకి ఏమయిందో కూడా తెలియదు. ఒక తెలుగు సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయి ఆమె రాక కోసం ఎదురు చూస్తుండగా.. ఇంకో సినిమా అయిపోవచ్చింది. అయితే.. సమంత ఇప్పుడు అమెరికా (USA)లో  ఉందని, అక్కడ ఆమె చర్మానికి (Skin Disease) సంబంధించి ఏదో చికిత్స చేయించుకుంటోంది చిత్ర పరిశ్రమలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చికిత్స ఎంతవరకు, ఎన్నాళ్లు అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదంట. కనీసం రెండు నెలలు అయినా పడుతుంది అని అనుకుంటున్నారు.


ఇప్పటి వరకూ సమంత ముంబై (Mumbai)లో వుందని అందరూ అనుకుంటూ ఉండగా.. అమెరికా వెళ్లిపోయిందని యశోద చిత్ర యూనిట్ వాళ్లే అంటున్నారు. సమంత చేస్తున్ ‘యశోద’ సినిమా టీజర్ ఇటీవలే విడుదల అయింది. దాని కోసం ఆ  చిత్ర నిర్వాహకులు ముందుగా సమంతకి పంపి ఆమె ఆ టీజర్‌ని ఒకే చేసిన తర్వాతే విడుదల చేశారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని కూడా ఆమె అమెరికా నుంచే మొత్తం మోనిటర్ చేస్తోందని.. ఆ చిత్రబృందంలోని కొందరు చెబుతున్నారు. యశోద సినిమాలో సమంతనే లీడ్ యాక్టర్. అందులో ఆమెకాకుండా పెద్ద స్టార్స్ వేరేవ్వరూ లేరు. ఒక్క వరలక్ష్మి శరత్ కుమార్ తప్ప. ఇది ఒక సూపర్ నాచురల్ సినిమా అని మూవీ టీం చెబుతోంది. అందువల్ల అమెరికా నుంచే ఏ సీన్ ఉండాలి, ఏ సీన్ తీసేయ్యాలని సమంత చెపుతూ ఉంటే దర్శక నిర్మాతలు అలానే చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమా విడుదల సమంత మళ్లీ ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాతే ఉంటుందని చెబుతున్నారు. అయితే.. సమంత అమెరికాలో ఎన్నాళ్లు ఉంటుందో మాత్రం ఎవ్వరికీ క్లారిటీ లేదని మాత్రం చిత్ర నిర్వాహకులు చెబుతున్నారు.

Updated Date - 2022-09-18T19:16:15+05:30 IST