సినిమా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను రాబట్టడంలో బాలీవుడ్ నిర్మాత, హోస్ట్ కరణ్ జోహార్ దిట్ట. ప్రస్తుతం ఆయన సమంత వ్యక్తిగత విషయాలను బయటపెట్టే పనిలో ఉన్నారు. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ సెలబ్రిటీ షో ‘కాఫీ విత్ కరణ్’కు సమంతను అతిథిగా ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు. అందులో సమంత పెళ్లి గురించి మాట్లాడారు. కరణ్ అడిగిన ప్రతి ప్రశ్నకు కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చారామె!
సమంత విడాకులు గురించి తెలుసుకోవాలని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఈ ప్రోమో చూశాక ఆ కోరిక నెరవేరనుందని కొందరు భావిస్తున్నారు. అనుకున్నట్లుగానే సమంత పెళ్లి, తదితర విషయాల గురించి పెదవి విప్పారు. ‘‘వైవాహిక జీవితం ఆనందంగా లేకపోవడానికి కారణం నువ్వే(కరణ్‌ను ఉద్దేశించి). జీవితం అంటే ‘కభీ ఖుషి కభీ గమ్’లా ఉంటుందని చూపిస్తారు. రియాలిటీకి వచ్చేసరికి అది ‘కేజీఎఫ్’లా ఉంటుంది’’ అని ‘కాఫీ విత్ కరణ్’ షోలో సమంత అన్నారు. అయితే ఈ షోలో సమంత ఏం చెప్పారు అన్నది తెలియాలంటే ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 7 ఫాలో అవ్వాల్సిందే. ఈ నెల 7న ఈ సీజన్ ప్రారంభం కానుంది.