Samantha: ఇకపై వాటికి దూరం..?

ABN , First Publish Date - 2022-09-02T19:35:23+05:30 IST

సమంత (Samantha) ఇకపై కొన్ని పాత్రలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది కూడా మరో స్టార్ హీరోయిన్ నయనతార (Nayanatara)ను ఫాలో అవుతూ..

Samantha: ఇకపై వాటికి దూరం..?

సమంత (Samantha) ఇకపై కొన్ని పాత్రలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది కూడా మరో స్టార్ హీరోయిన్ నయనతార (Nayanatara)ను ఫాలో అవుతూ.. అంటున్నారు. సమంత, ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమాకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. మొదటి సినిమాలోనే ముద్దుల వర్షం కురిపించి హాట్ టాపిక్‌గా మారిన సమంత ఆ తర్వాత నటించిన సినిమాలలోనూ లిప్ లాక్స్‌కి, గ్లామర్ రోల్స్‌కి అడ్డు చెప్పలేదు.


తెలుగు, తమిళ సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించిన సమంత ఎక్కువగా చేసింది గ్లామర్ పాత్రలే అని చెప్పాలి. అయితే, నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత చేసిన మజిలీ, ఓ బేబీ, జాను చిత్రాలలో చాలా డీసెంట్ పాత్రలను పోషించింది. జాను డిజాస్టర్ కాగా, మజిలీ..ఓ బేబీ కెరీర్‌లో మంచి హిట్ చిత్రాలుగా నిలిచాయి. అయితే, నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఒప్పుకుంటున్న కొన్ని సినిమాలు, ఫొటో షూట్స్, వెబ్ సిరీస్‌లలో మితి మీరిన గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.


శాకుంతలం (Shakunthalam), యశోద (Yashoda) లాంటి డీసెంట్ చిత్రాలు చేస్తున్నా కూడా అవి పట్టించుకోకుండా తన గ్లామర్ పాత్రలు, బోల్డ్ పర్ఫార్మెన్స్ గురించే కామెంట్స్ చేస్తున్నారు. అయితే, కారణం ఏంటో తెలియదు గానీ, సమంత ఇప్పుడు కొత్తగా కమిటయ్యే సినిమాలకు కండీషన్స్ పెడుతుందట. ఈ విషయంలో మరో స్టార్ హీరోయిన్ నయనతారను ఫాలో అవుతూ గ్లామర్ రోల్స్, లిప్ లాక్స్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. మేకర్స్‌తో ఇదే విషయం క్లారిటీగా చెబుతున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే సమంత సడన్‌గా ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుందో తెలియాల్సి ఉంది. ఇక పెళ్ళి తర్వాత నయనతార కూడా గ్లామర్ రోల్స్ చేయనని తెగేసి చెబుతున్నట్టు ప్రచారం అవుతోంది. 

Updated Date - 2022-09-02T19:35:23+05:30 IST