Samantha : ఎంట్రీలోనే డ్యూయల్ రోల్స్?

ABN , First Publish Date - 2022-09-06T17:52:52+05:30 IST

కొద్దిరోజులుగా అందాల సమంత (Samantha) బాలీవుడ్ ఎంట్రీ గురించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇంతలో సామ్. బాలీవుడ్‌లో ఓ వెబ్ సిరీస్‌కు కమిట్ అయింది.

Samantha : ఎంట్రీలోనే డ్యూయల్ రోల్స్?

కొద్దిరోజులుగా అందాల సమంత (Samantha) బాలీవుడ్ ఎంట్రీ గురించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇంతలో సామ్. బాలీవుడ్‌లో ఓ వెబ్ సిరీస్‌కు కమిట్ అయింది. దానికి సంబంధించిన పనులు ప్రస్తుతం నడుస్తుండగా.. బాలీవుడ్ మూవీలోని సమంత పాత్ర గురించి ఓ అప్డేట్ బైటికొచ్చింది. దాని ప్రకారం ఇందులో ఆమె డ్యూయల్ రోల్స్ చేస్తున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ రెండు పాత్రలు వేటికవే డిఫరెంటట.  ఆయుష్మాన్ ఖురానా (Ayushman Khurana) హీరోగా నటిస్తున్న ఈ సినిమా హ్యూమర్ అండ్ సస్పెన్స్ మిళితమైన కథాంశంతో తెరకెక్కబోతోంది. త్వరలోనే ఈ మూవీ కేస్టింగ్ అండ్ క్రూ వివరాలు తెలుస్తాయి. 


నిజానికి హీరోయిన్ తాప్సీ పన్ను (Tapsee Pannu).. తన సొంత నిర్మాణ సంస్థలో సమంతతో సినిమా చేస్తున్నట్టు ప్రకటించింది. బాలీవుడ్ లో సామ్ నటించే మొట్టమొదటి సినిమా అదే అవనుందని అన్నారు. కానీ ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్ళడానికి ఇంకా టైమ్ పట్టేలా ఉండడంతో .. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్న సినిమానే సామ్ మొదటి బాలీవుడ్ మూవీ కానుందని వినికిడి. 


గతంలో సమంత విక్రమ్ (Vikram) హీరోగా నటించిన ‘పత్తు ఎన్రదుక్కుళ్ళ’ (Pathu Endrathukkulla) (తెలుగులో 10) అనే మూవీ తమిళ మూవీతో సమంత మొట్టమొదటి సారిగా ద్విపాత్రాభినయం చేసింది. అందులో ఒక సమంత పాత్ర నెగెటివ్ షేడ్స్ తో కనిపించి జనానికి షాకిచ్చింది. సినిమా పరాజయం పాలవడంతో ఆ మూవీ గురించి అప్పట్లో పట్టించుకోలేదు. ఇప్పుడు తన హిందీ డెబ్యూ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తుండడం విశేషంగా మారింది. ప్రస్తుతం సామ్.. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి వర్క్ షాప్ లో పాల్గొంటోంది. త్వరలో సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. 

Updated Date - 2022-09-06T17:52:52+05:30 IST