Samantha: 'కాఫీ విత్ కరణ్' ..సమంత ఎపిసోడ్ కంప్లీట్..?

ABN , First Publish Date - 2022-06-18T16:43:51+05:30 IST

హిందీలో క్రేజీ టాక్ షో అయిన 'కాఫీ విత్ కరణ్' (Koffee With Karan) సీజన్ 7 త్వరలో ప్రారంభం కాబోతుంది. అయితే, స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఈ టాక్ షోలో పాల్గొంటుందని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

Samantha: 'కాఫీ విత్ కరణ్' ..సమంత ఎపిసోడ్ కంప్లీట్..?

హిందీలో క్రేజీ టాక్ షో అయిన 'కాఫీ విత్ కరణ్' (Koffee With Karan) సీజన్ 7 త్వరలో ప్రారంభం కాబోతుంది. అయితే, స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఈ టాక్ షోలో పాల్గొంటుందని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమెకు సంబంధించిన ఎపిసోడ్‌ను షూట్ చేసినట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌ స్టార్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్‌ జోహార్‌ (Karan Johar) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షోకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.


ఇప్పటికే, బాలీవుడ్ స్టార్స్‌తో కరణ్ 6 సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. అయితే, ఇటీవల ఆయన 'కాఫీ విత్ కరణ్' ఇకపై ఉండబోదని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మళ్ళీ కొంతసేపటికే, ఈ షో సీజన్ 7 త్వరలో స్టార్ట్ కాబోతుందని చెప్పి సర్‌ప్రైజ్ ఇచ్చారు. అంతేకాదు, ఈసారి కరణ్ సీజన్ 7లో ఎక్కువగా సౌత్ స్టార్స్‌తోనే సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది.


ఇప్పటికే, సమంత, సాయి పల్లవి (Sai Pallavi), రానా (Rana), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), నిత్యా మేనన్ ( Nithya Menen) లాంటి వారిని తన షోకు ఇన్‌వైట్ చేసినట్టు సమాచారం. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం సమంత తాజాగా 'కాఫీ విత్‌ కరణ్‌' టాక్ షోకు సంబంధిచిన ఎపిసోడ్ షూట్‌ను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. 'ది ఫ్యామిలీ మేన్ సీజన్ 2'తో సమంతకు బాలీవుడ్‌లో క్రేజ్ బాగానే పెరిగింది. ఈ టాక్ షో హిందీ ప్రేక్షకులకు మరింత దగ్గర చేయడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, సమంత, నాగ చైతన్య విడిపోయిన తర్వాత ఎక్కడ కూడా ఆమె దీనికి సంబంధించిన విషయాలను చెప్పేందుకు ఇష్టపడలేదు. అయితే, కరణ్ తన షో ద్వారా ఈ విషయాలను బయటికి లాగినట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి 'కాఫీ విత్ కరణ్ 7‌'లో సమంత ఎలాంటి ఆసక్తికరమైన విషయాలను చెప్పారో. కాగా, ఈ టాక్ షో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. 

Updated Date - 2022-06-18T16:43:51+05:30 IST