సౌత్‌లోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న రెండో హీరోయిన్‌గా సమంత

ABN , First Publish Date - 2022-03-10T21:35:22+05:30 IST

మహిళా ప్రధాన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న నటి సమంత

సౌత్‌లోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న రెండో హీరోయిన్‌గా సమంత

మహిళా ప్రధాన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న నటి సమంత. ఆమె అన్ని రకాల పాత్రలను అలవోకగా పోషించగలనని నిరూపించుకుంది. ‘మజిలీ’, ‘ఓ బేబీ’, ‘యూ టర్న్’ సినిమాల్లో నటించి ప్రేక్షకులపై తనదైన ముద్ర వేసింది. ఆ క్రమంలో, యావత్ దక్షిణాదిలోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రెండో హీరోయిన్‌గా సమంత నిలిచినట్లు తాజాగా తెలుస్తోంది. సామ్ కంటే అధికంగా నయనతార మాత్రమే పారితోషికం అందుకుంటోందట. 


సమంత ఒక్కో సినిమాకు దాదాపుగా రూ.3కోట్ల నుంచి రూ.5కోట్ల పారితోషికం అందుకుంటుందని టాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రొడక్షన్ హౌస్, కాల్షీట్స్, కథను బట్టి ఆ పారితోషికం  మారుతుంటుందని సమాచారం. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ సినిమలో సామ్ ‘ఊ అంటావా’ అనే స్పెషల్ సాంగ్‌లో నటించింది. ఈ పాట చేయడం ఆమెకు ఇష్టం లేదు. బన్నీ చెప్పడంతోనే ఆమె పాట చేసేందుకు ఒప్పుకుందని సమాచారం. ఈ సాంగ్ చేసినందుకు దాదాపుగా రూ. 5కోట్లను రెమ్యూనరేషన్‌గా సమంత అందుకుందంట. ప్రస్తుతం సామ్ ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటోంది. ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం ఆమె ‘యశోద’, ‘శాకుంతలం’, ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది.

Updated Date - 2022-03-10T21:35:22+05:30 IST