ముంబైలో బాలీవుడ్ ‘భాయ్‌జాన్‌’కు ఎన్ని ఇళ్లు, ఫామ్‌హౌస్‌లు? వాటి విలువ ఎన్నెన్ని కోట్లు? తెలిస్తే...

ABN , First Publish Date - 2022-02-05T22:15:01+05:30 IST

బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. ప్రపంచవ్యాప్తంగా అతడికి అభిమానులున్నారు

ముంబైలో బాలీవుడ్ ‘భాయ్‌జాన్‌’కు ఎన్ని ఇళ్లు, ఫామ్‌హౌస్‌లు? వాటి విలువ ఎన్నెన్ని కోట్లు? తెలిస్తే...

బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. ప్రపంచవ్యాప్తంగా అతడికి అభిమానులున్నారు. ఓవర్సీస్‌లోను అతడి చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తాయి. బాలీవుడ్ భాయ్‌జాన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆస్తులున్నాయి. సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత ధనవంతులైన నటుల్లో ఒకరని చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే.. సల్లూ భాయ్‌కు ఎన్ని ఆస్తులున్నాయో  తెలుసుకోవాలనుందా..ఈ స్టోరీని చదివేయండి మరి..


పన్వేల్ ఫామ్‌హౌస్: 

సల్మాన్ వీలు చిక్కినప్పుడల్లా ఈ ఫామ్‌హౌస్‌లోనే సేద తీరుతుంటాడు. ‘అర్పిత ఫామ్స్’ అని కూడా దీనిని పిలుస్తారు. సల్మాన్ సోదరి పేరు అర్పిత అనే సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ ఫామ్‌హౌస్‌లోనే భాయ్‌జాన్‌ను పాము కాటు వేసింది. ముంబై నుంచి ఒక గంట సేపు ప్రయాణిస్తే ఈ ఫామ్‌హౌస్ చేరుకోవచ్చు. దీని విలువ దాదాపు రూ. 80కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 


గోరై బీచ్ హౌస్:

బాలీవుడ్ భాయ్‌జాన్‌‌కు పన్వేల్‌లోనే కాకుండా గోరై అనే ప్రాంతంలోను ఫామ్‌హౌస్ ఉంది. ఇక్కడ ఫామ్‌హౌస్ ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ ఫామ్‌హౌస్ విలువ భారీ స్థాయిలో రూ.100కోట్లు ఉంటుందని సమాచారం. 


గెలాక్సీ అపార్ట్‌మెంట్స్:

సల్మాన్ తన కుటుంబంతో కలిసి ముంబై నడిబొడ్డున గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తుంటాడు. ఈ అపార్ట్‌మెంట్ విలువ దాదాపుగా రూ.16కోట్లు ఉంటుందని బీ టౌన్ మీడియా తెలుపుతోంది.


బాంద్రా ఫ్లాట్: 

సల్మాన్ బాంద్రాలోనూ ఒక అపార్ట్‌మెంట్‌లో ఓ విలాసవంతమయిన ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. ఆ అపార్ట్‌మెంట్‌లోని 11వ అంతస్తును పూర్తిగా హీరో సొంతం చేసుకున్నాడు. దీని ధర దాదాపుగా రూ. 30కోట్లు ఉంటుందట.


ఇవి బాలీవుడ్ ‘టైగర్’ ఆస్తుల్లో కొన్ని మాత్రమే. మరిన్ని ఆస్తులు వివిధ ప్రాంతాల్లో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ‘దబంగ్’ ఖాన్ విదేశీ ఆస్తుల విలువ మరింత ఎక్కువ ఉంటుంది!

Updated Date - 2022-02-05T22:15:01+05:30 IST