సల్మాన్ ఖాన్ లాయర్ Hastimal Saraswat కు బెదిరింపు లేఖ

ABN , First Publish Date - 2022-07-07T21:54:49+05:30 IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan), అతడి తండ్రి సలీమ్ ఖాన్(Salim Khan)కు కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ లేఖలో వారిద్దరిని

సల్మాన్ ఖాన్ లాయర్ Hastimal Saraswat కు బెదిరింపు లేఖ

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan), అతడి తండ్రి సలీమ్ ఖాన్(Salim Khan)కు కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ లేఖను రాసి  వారిద్దరిని చంపేస్తామంటూ బెదిరించారు. తాజాగా సల్మాన్ లాయర్ హస్తిమల్ సరస్వత్ (Hastimal Saraswat)కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. ‘శత్రవు స్నేహితుడు కూడా శత్రువే. సిద్ధూ మూసేవాలకు పట్టిన గతే నీకు పడుతుంది. నీ కుటుంబాన్ని కూడా వదిలిపెట్టం’ అని ఆ లేఖలో రాసి ఉంది. దీంతో సరస్వత్ జోధ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.      


సల్మాన్ కృష్ణజింక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సల్మాన్ తరఫున జోధ్‌ఫూర్ కోర్టులో హస్తిమల్ సరస్వత్ వాదిస్తున్నారు. బెదరింపు లేఖ నేపథ్యంలో జోధ్‌పూర్‌లోని మహామందిర్ పోలీస్ స్టేషన్‌లో సరస్వత్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ‘‘నేను నెల రోజులకు పైగా అమెరికాలో ఉన్నాను. జూన్ 30న జోధ్‌పూర్‌కు వచ్చాను. పాత హైకోర్టు భవనంలో జులై 1న ఓ లేఖ లభించిందని నా వద్ద పనిచేసేవారు చెప్పారు. నాతో సహా నా కుటుంబాన్ని చంపేస్తామని ఆ లేఖలో బెదిరించారు. అందువల్ల నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. సల్మాన్ నాకు స్నేహితుడు ఏం కాదు. అతడు అందరి లాగే క్లయింట్ మాత్రమే’’ అని హస్తిమల్ సరస్వత్ పేర్కొన్నారు. లేఖ చివరలో ఎల్‌బీ, జీబీ అనే పదాలు ఉన్నాయని చెప్పారు. ఆ పదాలు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీబ్రార్‌ల పేర్లను సూచిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2022-07-07T21:54:49+05:30 IST