సల్మాన్ ఖాన్ కుటుంబం నుంచి హీరోయిన్ ఎంట్రీ ..!

ABN , First Publish Date - 2022-01-27T02:23:51+05:30 IST

సల్మాన్ ఖాన్ కొన్ని రోజుల క్రితమే తన బామ్మర్ది ఆయుష్ శర్మను బాలీవుడ్‌కి పరిచయం చేశారు. తాజాగా మరొకరిని ఆయన బీ టౌన్‌కి పరిచయం

సల్మాన్ ఖాన్ కుటుంబం నుంచి  హీరోయిన్ ఎంట్రీ ..!

సల్మాన్ ఖాన్ కొన్ని రోజుల క్రితమే తన బామ్మర్ది ఆయుష్ శర్మను బాలీవుడ్‌కి పరిచయం చేశారు. తాజాగా మరొకరిని ఆయన బీ టౌన్‌కి పరిచయం చేయబోతున్నట్టు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. తన మేనకోడలు అలీజా అగ్ని హోత్రిని ఆయన లాంచ్ చేయబోతున్నట్టు సమాచారం. సన్నీ డియోల్ చిన్న కొడుకు రాజ్ వీర్ కూడా ఈ చిత్రంతోనే ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. కొత్త రకం లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. సూరజ్ బర్జత్యా కొడుకు అవినాష్ బర్జత్యా ఈ సినిమాకు దర్శకత్వం  వహించబోతున్నాడని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. ఈ సినిమా చిత్రీకరణ గతంలోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, కోవిడ్‌తో ఇంతవరకు షూటింగ్‌ ప్రారంభం కాలేదు.  


అలీజా అగ్నిహోత్రి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోయే మూవీ థాయ్ రీమేక్‌గా తెరకెక్కబోతోందని వార్తలొస్తున్నాయి. 2017లో విడుదలై బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన ‘బ్యాడ్ జీనియస్‌’ ను హిందీలో రీమేక్ చేయనున్నారట. మార్చిలో సినిమా చిత్రీకరణను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2023 ప్రారంభంలో విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం.

Updated Date - 2022-01-27T02:23:51+05:30 IST