Salman Khan మాజీ ప్రేయసి సంచలన కామెంట్స్.. బాలీవుడ్‌లో కామాంధుడు ఎవరో బయటపెడతానంటూ..

ABN , First Publish Date - 2022-03-31T17:24:25+05:30 IST

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎంతోమందితో ప్రేమాయణం నడిపారు...

Salman Khan మాజీ ప్రేయసి సంచలన కామెంట్స్.. బాలీవుడ్‌లో కామాంధుడు ఎవరో బయటపెడతానంటూ..

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎంతోమందితో ప్రేమాయణం నడిపారు. వారిలో అందాల తార ఐశ్వర్యారాయ్ నుంచి బ్యూటీఫుల్ కత్రినా కైఫ్ వరకు ఉన్నారు. ఆయన డేటింగ్ చేసిన వారిలో సినీయర్ నటి సోమీ అలీ కూడా ఒకరు. ఈ నటి తాజాగా ‘బాలీవుడ్‌లోని హర్వే వైన్‌స్టెన్’ని బయటపెడతానంటూ పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా ఆ పోస్ట్‌కి అందాల తార ఐశ్వర్యారాయ్‌ని సైతం ట్యాగ్ చేసింది.


ఆ పోస్ట్‌లో మైనే ప్యార్ కియా పాట ‘ఆతే జాతే‘ నుంచి ఒక స్టిల్‌ను షేర్ చేస్తూ సోమీ.. ‘ది హార్వే వైన్‌స్టీన్ ఆఫ్ బాలీవుడ్! మీ గురించి బయటి ప్రపంచానికి తెలుస్తుంది. ఐశ్వర్యరాయ్‌లాగా.. మీరు వేధించిన మహిళలందరూ ఏదో ఒక రోజు బయటకు వచ్చి నిజాలను అందరితో పంచుకుంటారు’ అంటూ రాసుకొచ్చింది. సోమీ పోస్ట్‌పై మోడల్, నటి నిక్కీ చావ్లా స్పందిస్తూ.. ‘ఆ అమ్మాయిలందరూ ఎలాంటి మానసిక క్షోభకు గురై ఉంటారో ఊహించలేం. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడినందుకు ఐశ్వర్యరాయ్‌కి ధన్యవాదాలు’ అంటూ కామెంట్ చేసింది.


కాగా.. హార్వే వైన్‌స్టెన్ అమెరికాకి చెందిన ఓ సినీ నిర్మాత. ఇతను లైంగికంగా వేధించాడని మీ టూ ఉద్యమంలో భాగంగా 2017లో 80 మంది మహిళలు ఆరోపణలు చేశారు. ఇతన్ని 2018లో అత్యాచార కేసు కింద న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేయగా.. విచారణ అనంతరం కోర్టు 23 సంవత్సరాల శిక్షను విధించింది. ఇంతమంది మహిళలు ఒకేసారి ఆరోపణలు చేయడంతో దీన్ని ‘వైన్‌స్టెన్ ఎఫెక్ట్’ అని పిలుస్తుంటారు.

Updated Date - 2022-03-31T17:24:25+05:30 IST