‘Green India Challenge 5.0’లో.. బాలీవుడ్ సూపర్ స్టార్

ABN , First Publish Date - 2022-06-22T23:04:24+05:30 IST

మొక్కలు నాటడాన్ని ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. ఏదో మొక్కను నాటామా.. పని అయిపోయిందా అని కాకుండా ఆ మొక్క పెరిగే వరకు శ్రద్ధ తీసుకోవాలి. ఒక్కో మొక్క ఒక్కో మనిషి జీవిత కాలానికి సరిపడా ఆక్సిజన్‌ను

‘Green India Challenge 5.0’లో.. బాలీవుడ్ సూపర్ స్టార్

‘‘ఒక్కో మొక్క ఒక్కో మనిషి జీవిత కాలానికి సరిపడా ఆక్సిజన్‌ను అందిస్తుంది’’ అని అన్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Super Star Salman Khan). తన తాజా సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌ (Hyderabad)కి వచ్చిన సల్మాన్ ఖాన్, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ (Joginapally Santosh Kumar)తో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటి ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5.0’ లో భాగమయ్యారు.


మొక్కలు నాటిన అనంతరం సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘మొక్కలు నాటడాన్ని ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. ఏదో మొక్కను నాటామా.. పని అయిపోయిందా అని కాకుండా ఆ మొక్క పెరిగే వరకు శ్రద్ధ తీసుకోవాలి. ఒక్కో మొక్క ఒక్కో మనిషి జీవిత కాలానికి సరిపడా ఆక్సిజన్‌ను అందిస్తుంది. అకాల వర్షాలు, వరదలు, విపత్తులతో మన కళ్ల ముందే దేశంలో అనేక మంది ప్రజలు చనిపోతుండటం బాధాకరం. వాతావరణ మార్పులతో జరిగే అనర్థాలు ఆగాలంటే మనం చెట్లు నాటడం ఒక్కటే మార్గం. ఈ పనికి జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ (Green India Challenge) ద్వారా బాటలు వేసారు. దాన్ని మనం కొనసాగిస్తే మన నేలను, భవిష్యత్ తరాలను కాపాడుకోవచ్చు. నా అభిమానులంతా విధిగా ఈ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొని విరివిగా మొక్కలు నాటాలని కోరుతున్నాను..’’ అని అన్నారు.


‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఆద్యులు జోగినిపల్లి సంతోష్  కుమార్ మాట్లాడుతూ.. ‘‘ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా మొక్కలు నాటుదామని చెప్పగానే.. పెద్ద మనసుతో వచ్చి మొక్కలు నాటిన సల్మాన్ ఖాన్‌గారికి కృతజ్ఞతలు. మీలాంటి వారు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడంతో.. ఇది కోట్ల మంది అభిమానులకు స్పూర్తిగా నిలుస్తుంది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి.. పర్యావరణాన్ని కాపాడుకుందాం..’’ అని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆయన చేస్తున్న సినిమా బృందంతో పాటు ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కో ఫౌండర్ రాఘవ, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





Updated Date - 2022-06-22T23:04:24+05:30 IST