‘అన్న’ అన్న పదంలోనే బోలెడు ఆనందం ఉందంటున్న బ్యాచిలర్ భాయ్‌జాన్!

ABN , First Publish Date - 2021-12-29T00:51:10+05:30 IST

‘‘ఎవరైనా సరే, వాళ్లది ఏ వర్గం, ఏ కులం, ఏ మతమైనా సరే, అందరూ నన్ను ‘భాయ్’ అంటారు. అదే నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంటుంది’’ అన్నాడు మన ‘బజ్రంగీ భాయ్‌జాన్’.

‘అన్న’ అన్న పదంలోనే బోలెడు ఆనందం ఉందంటున్న బ్యాచిలర్ భాయ్‌జాన్!

‘భాయ్’ లేదా ‘భాయ్‌జాన్’ అంటూ జనం చేత పిలిపించుకోవటం తనకు ఎంతో ఇష్టమంటున్నాడు సల్మాన్. అంతే కాదు, ‘అన్న’ అనే అర్థం వచ్చేలా దేశమంతా తనని ఆప్యాయంగా సంబోధించటం ఎంతో ఆనందంగా ఉంటుందని కూడా చెప్పాడు. ‘భాయ్‌జాన్’ అనే పిలుపుతో వల్ల ఆయనకు దేశ మొత్తం తనే కుటుంబమే అనే భావన కలుగుతుంటుందట!


‘‘ఎవరైనా సరే, వాళ్లది ఏ వర్గం, ఏ కులం, ఏ మతమైనా సరే, అందరూ నన్ను ‘భాయ్’ అంటారు. అదే నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంటుంది’’ అన్నాడు మన ‘బజ్రంగీ భాయ్‌జాన్’. డిసెంబర్ 27న జన్మదినం జరుపుకున్న ఈ మోస్ట్ సీనియర్ బ్యాచిలర్ బాబు ఇప్పటికీ చాలా మంది అమ్మాయిలకు హాట్ ఫేవరెట్ హీరోనే! ఇక 56 ఏళ్ల హ్యాండ్సమ్‌కు అబ్బాయిల్లోనూ బోలెడు క్రేజ్ ఉంది. అందుకే, నెక్ట్స్ తన లక్కీ బ్యూటీ కత్రీనాతో కలసి మరోసారి ‘టైగర్‌‌’గా బాక్సాఫీస్ వద్దకి రాబోతున్నాడు. ‘టైగర్ 3’‌లో సరికొత్త డేర్ డెవిల్ స్టంట్స్ చేయబోతున్నాడట భాయ్‌జాన్ ఆఫ్ బాలీవుడ్...   

Updated Date - 2021-12-29T00:51:10+05:30 IST