1000 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తేనే చేస్తా.. Salman Khan కండీషన్‌కు నిర్మాతలు ఒప్పుకుంటారా..?

ABN , First Publish Date - 2022-07-14T17:07:52+05:30 IST

బాలీవుడ్‌లో సూపర్ స్టార్‌డమ్ ఉన్న నటుల్లో సల్మాన్ ఖాన్ ముందు వరుసలో ఉంటాడు. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ...

1000 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తేనే చేస్తా.. Salman Khan కండీషన్‌కు నిర్మాతలు ఒప్పుకుంటారా..?

బాలీవుడ్‌లో సూపర్ స్టార్‌డమ్ ఉన్న నటుల్లో సల్మాన్ ఖాన్ (Salman Khan) ముందు వరుసలో ఉంటాడు. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ అభిమానులను అలరించే ఈ నటుడు ‘బిగ్‌బాస్ (Bigg Boss)’ రియాలిటీ షోని హోస్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ షో ఇప్పటికే పదిహేను సీజన్లను విజయవంతం పూర్తి చేసుకొని పదహారో సీజన్‌కి రెడీ అవుతోంది. అయితే.. గత సీజన్‌కి సల్లు భాయ్ రూ.350 కోట్ల భారీ రెమ్యూనరేషన్ అందుకున్నాడు. తాజాగా ఈ సీజన్‌కి సల్మాన్ ఖాన్ తీసుకోబోయే రెమ్యూనరేషన్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది.


గత 13 సంవత్సరాలుగా బిగ్‌బాస్‌ని సల్మాన్ హోస్ట్ చేస్తున్నాడు. అయితే.. ప్రతిసారి ఆయన ఈ షోకి యాంకరింగ్ చేయట్లేదని వార్తలు వినిపించాయి. దీంతో భారీ రెమ్యూనరేషన్‌ ఆఫర్ చేయడం ద్వారా ఆయన్ని షోకి తీసుకొచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే.. ఒక్కసారి కూడా ఈ న్యూస్‌పై అధికారిక ధృవీకరణ జరగలేదు. రాబోయే సీజన్‌ గురిం సైతం అలాంటి రూమర్స్ వినిపిస్తున్నాయి. గత సీజన్‌కి మూడు రెట్ల పారితోషికాన్ని సల్మాన్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే.. దాదాపు రూ.1000 కోట్లకి పైగా సల్లు భాయ్ షో హోస్టింగ్ రెమ్యూనరేషన్‌గా అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇదెంతా వరకూ నిజమో తెలియట్లేదు. 


కానీ.. గత సీజన్లలో ఆయనకి సరైన స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచలేదని, అందుకే పారితోషికం మూడు రెట్ల పెంపుపై సల్మాన్ మొండిగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకూ షోకి హోస్టింగ్ చేసేందుకు సల్లుభాయ్ సిద్ధంగా లేడంట. అయితే.. ఈ న్యూస్‌ గురించి కూడా కన్‌ఫర్మేషన్ లేదు. ఒకవేళ ఈ నివేదికలు నిజమైతే.. బిగ్ బాస్ 16ని హోస్ట్ చేయడానికి సల్మాన్ ఖాన్ మొత్తం రూ.1050 కోట్లను అందుకుంటాడు. సల్మాన్ కండీషన్‌ని ఆ షో నిర్మాతలు ఒప్పుకుంటారో లేదు చూడాలి మరి. సినిమాల విషయానికి వస్తే, సల్మాన్ ప్రస్తుతం ‘టైగర్ 3’లో నటిస్తున్నాడు. అందులో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే.. ‘కబీ ఈద్ కబీ దివాళి’ అనే మూవీ చేస్తున్నాడు. అందులో.. టాలీవుడ్ హీరో వెంకటేశ్, పూజా హేగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Updated Date - 2022-07-14T17:07:52+05:30 IST