Salman Khan bullet proof car: బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రయాణిస్తున్న సల్మాన్ ఖాన్

ABN , First Publish Date - 2022-08-01T01:53:03+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). కొన్ని రోజుల క్రితమే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి అతడికి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ గ్యాంగే పంజాబీ సింగర్

Salman Khan bullet proof car: బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రయాణిస్తున్న సల్మాన్ ఖాన్

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). కొన్ని రోజుల క్రితమే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి అతడికి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ గ్యాంగే పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలాను (Sidhu Moosewala) మే‌లో దారుణంగా హత్య చేసింది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ భద్రతా కారణాల రీత్యా బుల్లెట్ ప్రూఫ్ కారుకు మారినట్టు తెలుస్తోంది. 


సల్మాన్ ఖాన్ 2007లో కృష్ణ జింకను వేటాడాడనే ఆరోపణలు ఉన్నాయి. అతడిపై కోర్టులో విచారణ కూడా కొనసాగుతోంది. అప్పటి నుంచి సల్లూ భాయ్‌ను హత్య చేయాలని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రయత్నిస్తుంది. ఈ మధ్యనే సల్మాన్ ఖాన్, అతడి తండ్రి సలీమ్ ఖాన్‌ను చంపుతామని బెదిరింపు లేఖను కూడా రాసింది. దీంతో పోలీసులు బాలీవుడ్ భాయ్‌జాన్‌కు భద్రతను పెంచారు. అయినప్పటికీ, సల్మాన్ తన జాగ్రత్తల్లో తాను ఉంటున్నాడు. ఈ బెదిరింపులను సీరియస్‌గా తీసుకున్నాడు. టయోట ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ఫ్రూప్ కారులో ప్రయాణించడం మొదలుపెట్టాడు. తాజాగా ఈ కారులో ప్రయాణిస్తూ కెమెరా కంటికి చిక్కాడు. ఈ కారు లేటెస్ట్ మోడల్ కాదని తెలుస్తోంది. భద్రతా కారణాల రీత్యా సల్మాన్ ఖాన్.. గన్ లైసెన్స్‌కు కూడా దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాన్ని ముంబై కమిషనర్ ఆఫ్ పోలీస్ ధ్రువీకరించింది. ‘‘బెదిరింపు లేఖ రావడంతో భద్రతా కారణాల రీత్యా సల్మాన్ ఖాన్ గన్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకున్నాడు’’ అని పోలీసులు పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-01T01:53:03+05:30 IST