Salman Khan: జేబులో గాజు సీసాతో పార్టీకి వెళ్లిన సల్మాన్.. అందులో ఏముందంటూ..

ABN , First Publish Date - 2022-09-05T15:41:25+05:30 IST

బాలీవుడ్ స్టార్స్ అందరూ పార్టీ ప్రియులనే విషయం తెలిసిందే. అందుకే ప్రతిరోజూ ఆ సర్కిల్‌లో ఏదో పార్టీ జరగుతూనే ఉంటుంది...

Salman Khan: జేబులో గాజు సీసాతో పార్టీకి వెళ్లిన సల్మాన్.. అందులో ఏముందంటూ..

బాలీవుడ్ స్టార్స్ అందరూ పార్టీ ప్రియులనే విషయం తెలిసిందే. అందుకే ప్రతిరోజూ ఆ సర్కిల్‌లో ఏదో పార్టీ జరగుతూనే ఉంటుంది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ (Salman Khan) అలాంటి పార్టీలలో చాలా ముందుంటాడు. ఆయనే తరుచుగా బాలీవుడ్ (Bollywood) సెలబ్రిటీలను పిలిచి తన ఫామ్ హౌస్‌లో పార్టీలు హోస్ట్ చేస్తుంటాడు. ఈ స్టార్‌కి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఆ వీడియోలో.. జీన్స్‌, టీ షర్ట్‌లో ఉన్న సల్మాన్ చేతిలో ఓ గాజు సీసా ఉంది. అందులో సగం వరకూ ఏదో ద్రవం ఉంది. దాన్ని ప్యాంటు జేబులో పెట్టుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ వీడియోలో అది గమనించిన పలువురు నెటిజన్లు స్పందిస్తూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఆ సీసాలో వైన్ ఉందా లేక నీళ్లు ఉన్నాయా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘గ్లాసు లోపల ఏముంది’, ‘ప్యాంట్ జేబులో గ్లాస్.. కొత్త స్టైల్ భాయ్’ అంటూ రాసుకొచ్చారు.


కాగా.. ‘అంతిమ్: ది ఫైనల్ ట్రూత్’ సినిమాతో 2021లో తెరపై కనిపించిన సల్మాన్ చేతిలో ప్రస్తుతం పలు సినిమాలు ఉన్నాయి. కత్రినా కైఫ్‌తో ‘టైగర్ 3’, పూజా హేగ్డే, వెంకటేశ్‌తో కలిసి ‘కబీ ఈద్ కబీ దివాళి’ సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాకుండా.. మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో, రితేశ్ దేశ్‌ముఖ్ ‘వేద్’, షారూఖ్ ఖాన్ ‘పఠాన్‌’లో కూడా అతిథి పాత్రలో కనిపించనున్నాడు.



Updated Date - 2022-09-05T15:41:25+05:30 IST