ఆ కోతులకు సల్మాన్ ఏమిచ్చాడంటే...

ABN , First Publish Date - 2021-11-19T01:13:23+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్. ఈ కండల వీరుడి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఆ కోతులకు సల్మాన్ ఏమిచ్చాడంటే...

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్. ఈ కండల వీరుడి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందుకు కారణమేమిటంటే అతడు తన మేనకోడలితో కలిసి కోతులకు ఆహారాన్ని అందిస్తున్నాడు. దీంతో ఈ వీడియోను సల్మాన్ అభిమానులు తెగ షేర్ చేసుకుంటున్నారు. 


సల్మాన్ ఖాన్ సోదరి పేరు అర్పితా ఖాన్ శర్మ. అర్పిత కూతురైన అయత్‌తో కలిసి సల్మాన్ కోతులకు ఆహారాన్ని అందిస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొదట సల్మాన్ ఖాన్ ఒంటరిగా కోతులకు ఆహారాన్ని అందించడం మొదలుపెట్టాడు. అనంతరం సల్మాన్‌కు తోడుగా అతడి మేనకోడలు జతయింది. మేనకోడలితో కలిసి భాయిజాన్ కోతులకి ఆహారంగా అరటి పండ్లను అందివ్వడం మొదలుపెట్టగానే ఆమె చప్పట్లు కొట్టడం ప్రారంభించింది.  దీంతో సల్మాన్ మేనకోడలిని చూసి నవ్వడం మొదలుపెట్టాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో సల్మాన్ ఖాన్ ఈ వీడియోను పోస్ట్ చేసి మంకీ అని కామెంట్‌ను రాశాడు. 


ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బిగ్ బాస్-15కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. టైగర్-3, కిక్-2 సినిమాల్లో నటించనున్నాడు. సల్మాన్ నటించిన అంతిమ్ సినిమా నవంబర్ 26న థియేటర్లల్లో విడుదల కానుంది.  



Updated Date - 2021-11-19T01:13:23+05:30 IST