Salman Khan కు, తండ్రి Salim Khan కు బెదిరింపు లేఖ.. చంపేస్తానంటూ రాసిన లేఖలో ఆ సింగర్ పేరు..!

ABN , First Publish Date - 2022-06-06T17:54:01+05:30 IST

ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూస్ వాలా హత్య గురించి తెలిసిందే. మే 29న కొందరు అగంతకులు కాల్పులు..

Salman Khan కు, తండ్రి Salim Khan కు బెదిరింపు లేఖ.. చంపేస్తానంటూ రాసిన లేఖలో ఆ సింగర్ పేరు..!

ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూస్ వాలా హత్య గురించి తెలిసిందే. మే 29న కొందరు అగంతకులు కాల్పులు జరపడంతో ఈ పాపులర్ సింగర్ మృతి చెందాడు. అయితే పంజాబ్ పోలీసులు సెక్యూరిటీని ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈ ఘటన జరగడం ఇక్కడ విషాదం. దీంతో గాయకుడి బంధువులు సెక్యూరిటీ ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని అంటున్నారు. ఈ తరుణంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రీ సలీం ఖాన్‌కి ఓ బెదిరింపు లేఖ అందింది.


ప్రముఖ స్క్రిప్ట్ రైటర్ సలీం ఖాన్ ఇటీవల ఉదయం వాక్ చేస్తుండగా మధ్యలో కొద్దిసేపు బ్రేక్ తీసుకున్నారు. ఆ సమయంలో బాంద్రా బ్యాండ్ స్టాండ్ వద్ద ఆయనకి ఈ చిట్ దొరికింది. అనంతరం పోలీసులును కాంటాక్ట్ అయ్యారు. సిద్దూ మూస్ వాలాలాగే నిన్ను, నీ కుమారుడు సల్మాన్ ఖాన్ చంపుతామని అందులో ఉందని ఓ పోలీసు ఆఫీసర్ కన్‌ఫర్మ్ చేశారు.


ఈ విషయంలోపై బాంద్రా పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ఈ లేఖను ఓ బెంచ్‌లో సలీం ఖాన్ భద్రతా సిబ్బంది కనుగొన్నారు. సలీం ఖాన్ తన భద్రతా సిబ్బందితో కలిసి మార్నింగ్ వాక్ చేయడానికి వెళ్లారు. ఆయన సాధారణంగా విశ్రాంతి తీసుకునే ప్రదేశం ఉంది. అక్కడ బెంచ్ మీద ఓ చీటీ ఉంది. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు బాంద్రా బండ్‌స్టాండ్‌లోని సీసీటీవీ ఫుటేజీని తనిఖీ చేస్తున్నారు. అంతేకాకుండా దర్యాప్తులో భాగంగా స్థానికులని విచారిస్తున్నారు. సిద్ధు మూస్ వాలా మరణం తర్వాత ఇలాంటి విషయాలని సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-06-06T17:54:01+05:30 IST