Salman Khan : మధ్యలో మతంతో పనేంటి?

ABN , First Publish Date - 2022-01-21T22:54:42+05:30 IST

సల్మాన్ ఓ కేసు విషయంలో ప్రస్తుతం కోర్టు మెట్లెక్కాడు. తన పాన్వెల్ ఫామ్ హౌజ్ పక్కనుండే మరో భూమి తాలూకూ యజమానిపై పరువు నష్టం దావా వేశాడు. అయితే, తాజాగా న్యాయస్థానం చేపట్టిన విచారణ సందర్భంగా సల్మాన్ తరుఫు న్యాయవాది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన బాలీవుడ్ స్టార్ వ్యాఖ్యల్ని జడ్జ్ ముందు ఉంచాడు.

Salman Khan : మధ్యలో మతంతో పనేంటి?

సల్మాన్ ఓ కేసు విషయంలో ప్రస్తుతం కోర్టు మెట్లెక్కాడు. తన పాన్వెల్ ఫామ్ హౌజ్ పక్కనుండే మరో భూమి తాలూకూ యజమానిపై పరువు నష్టం దావా వేశాడు. అయితే, తాజాగా న్యాయస్థానం చేపట్టిన విచారణ సందర్భంగా సల్మాన్ తరుఫు న్యాయవాది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన బాలీవుడ్ స్టార్ వ్యాఖ్యల్ని జడ్జ్ ముందు ఉంచాడు. 


‘‘ఓ భూ వివాదంలో, ఎటువంటి సంబంధం లేకుండానే నా వ్యక్తిగత ప్రతిష్టని దెబ్బతీస్తున్నారు. నా మతాన్ని మధ్యలోకి లాగటం ఏంటి? నా తల్లి హిందువు. మా నాన్న ముస్లిమ్. మా తమ్ముళ్లు... పెళ్లి చేసుకున్నది హిందువుల్నే. మేం అన్ని పండగలూ జరుపుకుంటాం’’ అంటున్నాడు సల్మాన్. ఆయన తరుఫున వాదనల్ని వినిపించిన లాయర్... సల్మాన్ ఫామ్ హౌజ్ పక్కనుండే వ్యక్తి చెబుతోన్నవన్నీ అబద్ధలన్నీ కోర్టుకు తెలిపారు. గతంలో సల్మాన్ ఫామ్ హౌజ్‌ని అనుకుని ఉండే భూమికి తాను యజమాని అని చెప్పుకున్న ఓ వ్యక్తి బీ-టౌన్ హీరోపై పలు ఆరోపణలు చేశాడు. తన స్థలాన్ని సల్మాన్ని ఆక్రమించాడని ఆరోపించిన ఆయన ఓ గణపతి ఆలయానికి కూడా ఎవరూ వెళ్లకుండా ఖాన్ గేటు నెలకొల్పాడని విమర్శించాడు. తనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలకు ప్రతిగా భాయ్‌జాన్ కోర్టు గడప తొక్కాడు. పరువు నష్టం దావా వేశాడు. ప్రస్తుతం అదే కేసు విచారణ కొనసాగుతోంది... 

Updated Date - 2022-01-21T22:54:42+05:30 IST