Salman Khan: జేబులో గాజు గ్లాసు.. వోడ్కానా, టానికా అని ప్రశ్నిస్తున్న నెటిజన్స్..

ABN , First Publish Date - 2022-09-05T01:52:46+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా అతడికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా

Salman Khan: జేబులో గాజు గ్లాసు.. వోడ్కానా, టానికా అని ప్రశ్నిస్తున్న నెటిజన్స్..

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా అతడికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌‌‌‌‌‌‌‌గా మారింది. నెటిజన్స్ విపరీతంగా ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. పలు ఛలోక్తులు విసురుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. 


సల్లూ భాయ్ తాజాగా ఓ బర్త్ డే పార్టీకీ హాజరయ్యాడు. ఆ సమయంలో గాజు గ్లాసు పట్టుకుని కనిపించాడు. ఆ గ్లాసులో ఏదో ద్రవం ఉంది. ఫొటోగ్రాఫర్స్‌కు ఫోజులిచ్చే ముందు సల్మాన్ ఆ గ్లాసును జీన్స్ ప్యాకెట్‌లో దాచుకున్నాడు. అంతటితో ఆగకుండా గ్లాసును చేతితో దాచేందుకు ప్రయత్నించాడు. కొంత మంది ఈ ఘటనను మొత్తం వీడియో తీశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ కూడా అవాక్కయ్యారు. ఆ గ్లాసు గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. వైరల్ వీడియో కింద నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపించారు. ‘‘ఆ గ్లాసులో ఏముంది’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘వోడ్కానా, టానికా’’ అని మరో నెటిజన్ పోస్ట్ పెట్టారు. కొంత మంది సల్మాన్ అభిమానులు మాత్రం అతడిని ట్రెండ్ సెట్టర్‌గా అభివర్ణిస్తున్నారు. గ్లాసులో నీళ్లు మాత్రమే ఉన్నాయని కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. సల్మాన్ ఇప్పటికే ‘టైగర్-3’ (Tiger-3) షూటింగ్‌ను పూర్తి చేశాడు. తాజాగా ‘కీసీ కా బాయ్, కీసీ కీ జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan)ను పట్టాలెక్కించాడు. ఈ చిత్రంలో వెంకటేష్, పూజా హెగ్డే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ క్రిస్‌మస్ కానుకగా విడుదలయ్యే అవకాశం ఉంది.



Updated Date - 2022-09-05T01:52:46+05:30 IST