Salaar: హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌కు ప్రిపరేషన్..

ABN , First Publish Date - 2022-05-19T13:13:07+05:30 IST

'సలార్' (Salaar)..గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రమిది. 'కేజీఎఫ్' (KGF) సిరీస్‌తో సెన్షేషనల్ డైరెక్టర్‌గా మారిన ప్రశాంత్ నీల్ (Prashanth Neel)

Salaar: హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌కు ప్రిపరేషన్..

'సలార్' (Salaar)..గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రమిది. 'కేజీఎఫ్' (KGF) సిరీస్‌తో సెన్షేషనల్ డైరెక్టర్‌గా మారిన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. 'సాహో', 'రాధే శ్యామ్' చిత్రాలు వరుసగా ఫ్లాపవడంతో ఇప్పుడు ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాల మీద గట్టిగా ఫోకస్ పెట్టారు. హడావిడి లేకుండా ప్రతీ సన్నివేశం చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే, బాలీవుడ్ స్ట్రైట్ మూవీ ఆదిపురుష్ (Adipurush) షూటింగ్ కంప్లీట్ చేసిన డార్లింగ్ ..ప్రస్తుతం పాన్ వరల్డ్ మూవీ 'ప్రాజెక్ట్ K', (Project k) 'సలార్' (Salaar) చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు.


'సలార్' మొదలై ఏడాది దాటినప్పటికీ ఇప్పటి వరకు కేవలం 40 శాతం టాకీపార్ట్ మాత్రమే కంప్లీట్ అయిందట. దీనిలో కూడా మెజారిటీ భాగం యాక్షన్ సీన్స్‌నే తెరకెక్కించినట్టు సమాచారం. ఇక ప్రభాస్ ఇతర ప్రాజెక్టులలో.. అలాగే, దర్శకుడు ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' రిలీజ్ కారణంగా ప్రమోషన్స్, సక్సెస్ మీట్స్‌లలో పాల్గొనడం వల్ల 'సలార్‌'కు బాగానే బ్రేక్ పడింది. అయితే, త్వరలో ఈ మూవీ కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు. 


ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాను నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ వారు సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్‌తో దర్శకుడు ప్రశాంత్ నీల్ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ వీడియోలో ప్రశాంత్ నీల్ సీన్ ఎలా ఉండాలి..దానికి సంబంధించిన షాట్ డివిజన్ గురించి ఆర్ట్ డైరక్టర్‌తో డిస్కస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. కాగా, ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా శృతి హాసన్ నటిస్తుంది.  



Updated Date - 2022-05-19T13:13:07+05:30 IST