Salaar: ఇందులో నిజమెంత..?

ABN , First Publish Date - 2022-09-01T17:38:18+05:30 IST

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న భారీ యాక్షన్ సినిమా సలార్ (Salaar) సెట్స్‌పైకి రాబోతుందని తాజా సమాచారం. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

Salaar: ఇందులో నిజమెంత..?

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న భారీ యాక్షన్ సినిమా సలార్ (Salaar) సెట్స్‌పైకి రాబోతుందని తాజా సమాచారం. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. నెల రోజుల నుంచి టాలీవుడ్‌లో సినిమాల షూటింగ్ బంద్ చేసిన సంగతి తెలిసిందే. హీరోల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ ఖర్చులు సహా పలు విషయాలలో నిర్మాతలు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అవన్నీ ఓ కొలిక్కి రావడంతో మళ్ళీ సినిమా షూటింగ్స్ ప్రారంభించాలని మేకర్స్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.  


ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్, శృతి హాసన్ (Shruthi Haasan) జంటగా నటిస్తున్న సలార్ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నారట. సలార్ మొదలైనప్పటినుంచి రక రకాల కారణాలతో షూటింగ్ సజావుగా సాగడం లేదు. ఈ సినిమా సెట్‌పైకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా సగం షూటింగ్ కూడా పూర్తి కాలేదు. చాలాసార్లు షెడ్యూల్ ప్లాన్ చేసి క్యాన్సిల్ చేసిన సందర్భాలున్నాయి. కేజీఎఫ్ 2 వల్ల కొంత ఆలస్యం అయితే, ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల కొంత ఆలస్యం అయింది. 


అయితే, సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సలార్ కొత్త షెడ్యూల్ మొదలవబోతుందట. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, శృతి హాసన్ పాల్గొంటారని, వీరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ K మువీ కూడా చిత్రీకరణ దశలో ఉంది. ఇక ఇటీవల మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాను కూడా ప్రకటించారు. మరి ఈ మూడు చిత్రాలో ఏది ముందు సెట్స్‌పైకి వస్తుందో అధికారికంగా వెల్లైడైతే గానీ తెలియదు. ప్రభాస్ గత చిత్రాలు రాధే శ్యామ్, సాహో తీవ్రంగా నిరాశపరచాయి. అందుకే, నెక్స్ట్ సినిమాతో భారీ హిట్ అందుకోవాలని పట్టుదలగా ఉన్నారు. 

Updated Date - 2022-09-01T17:38:18+05:30 IST