Prashanth Neel: ప్రభాస్‌పై ‘సలార్’ దర్శకుడి అసంతృప్తి

ABN , First Publish Date - 2022-09-06T02:06:43+05:30 IST

ప్రభాస్ (Prabhas) ఈమధ్య చాలా సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు, అందులో రెండు మూడు సినిమాలు ఒకేసారి షూటింగ్ చేస్తూ చాలా బిజీగా కూడా వున్నాడు. ఇప్పుడు ప్రభాస్ షూటింగ్ చేస్తున్న చిత్రాలలో ‘సలార్’ (Salaar) కూడా ఒకటి..

Prashanth Neel: ప్రభాస్‌పై ‘సలార్’ దర్శకుడి అసంతృప్తి

ప్రభాస్ (Prabhas) ఈమధ్య చాలా సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు, అందులో రెండు మూడు సినిమాలు ఒకేసారి షూటింగ్ చేస్తూ చాలా బిజీగా కూడా వున్నాడు. ఇప్పుడు ప్రభాస్ షూటింగ్ చేస్తున్న చిత్రాలలో ‘సలార్’ (Salaar) కూడా ఒకటి.. దీనికి దర్శకుడు ప్రశాంత్ నీల్. అలాగే ‘ప్రాజెక్ట్ K’ (Project K) పేరుతో ఇంకొక సినిమా కూడా చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. మధ్యలో ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా కోసం అప్పుడప్పుడు ముంబై వెళ్లాల్సి వస్తోంది. ఇలా బిజీగా ఉండటంతో ప్రభాస్ తన ఫిజిక్ (శరీరాకృతి)ని ఒక క్రమ పద్ధతిలో ఉంచుకోవటం కష్టమవుతోంది. ‘సలార్’ సినిమా అంతా యాక్షన్‌తో కూడి ఉంటుంది. ‘కెజియఫ్’ (KGF)లో యష్ (Yash) ఎలా తన ఫిజిక్‌ని వుంచాడో అలా.. ‘సలార్’లో కూడా ప్రభాస్ మెయింటైన్ చేయాలి. కానీ అతను మూడు సినిమాల షూటింగ్స్ కోసం తిరుగుతూ ఉండటం వల్ల.. ‘సలార్’లో ప్రభాస్ లుక్ మారిపోతుండటంతో.. ఆ చిత్ర దర్శకుడు కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు భోగట్టా. 


అందుకే చాలా వరకు యాక్షన్ సన్నివేశాల్లో ప్రభాస్‌కు బదులు ఆయన డూప్‌ను పెట్టి తీసినట్టు కూడా తెలుస్తోంది. ప్రభాస్ నటించిన ‘సాహో’ (Sahoo) సినిమాలో కూడా చాలా సన్నివేశాల్లో డూప్ నటించినట్టే, ఈ ‘సలార్’లో కూడా డూప్ పనే ఎక్కువన్నమాట. అందుకని ప్రశాంత్ నీల్.. ప్రభాస్ కన్నా అతని డూప్‌నే ఎక్కువగా నమ్ముకున్నాడని అంటున్నారు. ప్రభాస్ కంప్లీట్‌గా అవుట్ ఆఫ్ ఫోకస్ వున్నాడని, అందువల్ల డూప్‌ని పెట్టి చాలా సన్నివేశాలు తీసేస్తున్నారని తెలిసింది. యాక్షన్ సినిమాలకి ఆ సినిమాలో నటించే లీడ్ యాక్టర్ రోజూ వ్యాయామాలు చేస్తూ తన శరీరాకృతిని ఒకేలా ఉంచుకుంటూ ఉండాలి. ఒక వేళ అలా చేయకపోయినట్టయితే అతనిలో చాలా తేడా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు గ్రాఫిక్స్‌కి ఎక్కువ పని పడుతుంది.. దానితో సినిమా నిర్మాణ వ్యయం పెరగడమే కాకుండా, టైం కూడా తీసుకుంటుంది. 


అయితే ‘సలార్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ (prashanth neel).. కాస్త అసంతృప్తితో ఉన్నప్పటికీ ప్రభాస్ డూప్ బాగున్నాడు కనుక.. అతనితో పని అయిపోతున్నందుకు సినిమా ఆగకుండా వున్నందుకు సంతోషంగానే వున్నాడట. డూప్ అంటే సినిమా మొత్తం అతనే చేసేస్తాడని అనుకోవద్దు.. క్లోజ్ అప్‌ షాట్స్‌లో మన రియల్ హీరో ఉంటాడు, మిగతా యాక్షన్ సన్నివేశాలన్నీ డూపే చేసేస్తాడు. ఇది డూపా, ఒరిజినలా అనే తేడా తెలియకుండా ఈ మధ్య ఒరిజినల్‌కి బాగా దగ్గరగా ఉండే డూప్‌లనే పట్టుకొస్తున్నారు. ‘పుష్ప’ (Pushpa)లో అల్లు అర్జున్‌ (Allu Arjun)కి కూడా కొన్ని సన్నివేశాల్లో డూప్‌ని పెట్టారు.. తెలిసిందా ఏంటి. అలాగే చాలామంది యాక్టర్స్‌కి పెడుతున్నారు, తెలుస్తోందా ఏంటి? ప్రభాస్ ‘సలార్’ కూడా అంతే.

Updated Date - 2022-09-06T02:06:43+05:30 IST