Sarkaruvaari Paata : అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. కానీ...

ABN , First Publish Date - 2022-06-02T20:35:48+05:30 IST

సూపర్‌‌స్టార్ మహేశ్‌బాబు (Mahaesh babu) , పరశురామ్ (Parasuram) కలయికలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘సర్కారువారి పాట’ (Sarkaruvaari Paata). ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్ళను రాబట్టింది. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో ఆర్ధిక నేరగాళ్ళు.. భారీ లోన్లు తీసుకొని ఎగ్గొడితే.. అది సామాన్యుల్ని ఎంతలా బాధిస్తుందో తెలుపుతూ.. సందేశాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు.

Sarkaruvaari Paata : అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. కానీ...

సూపర్‌‌స్టార్ మహేశ్‌బాబు (Mahaesh babu) , పరశురామ్ (Parasuram) కలయికలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘సర్కారువారి పాట’ (Sarkaruvaari Paata). ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్ళను రాబట్టింది. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో ఆర్ధిక నేరగాళ్ళు.. భారీ లోన్లు తీసుకొని ఎగ్గొడితే.. అది సామాన్యుల్ని ఎంతలా బాధిస్తుందో తెలుపుతూ.. సందేశాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. కీర్తి సురేశ్ (Keerthi Suresh) కథానాయికగా నటించగా.. సముద్రఖని (Samudrakhani) విలన్ గా మెప్పించారు. సుబ్బరాజు, వెన్నెల కిషోర్, తనికెళ్ళభరణి, పోసాని కృష్ణ మురళి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. తమన్ (Thaman) సంగీతం అందించగా.. ఆర్. మాది ఛాయాగ్రహణం నిర్వహించారు. 


మైత్రీమూవీ మేకర్స్ (Mythri Movie Makers), జీయమ్బీ ఎంటర్ టైన్ మెంట్స్ (GMB Entertainments), 14 రీల్స్ ప్లస్ (14 Reels Plus)  సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను  ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) అత్యధిక ధర చెల్లించి దక్కించుకుంది. సినిమా జూన్ 10 న కానీ, 24న కానీ విడుదలవుతుందని ముందుగా వార్తలు వినిపించాయి. అయితే అంతలోనే ఈ సినిమాను గుట్టు చప్పుడు కాకుండా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. 


కాకపోతే.. ఇక్కడో ట్విస్టుంది. ఈ సినిమాను ఓటీటీలో అందరికీ అందుబాటులోకి తీసుకురాలేదు. పేఫర్ వ్యూ రెంటల్ విధానంలో ఈ సినిమాను డిజిటల్ రిలీజ్ చేశారు. సాధారణ చందాదారులు సైతం అదనంగా డబ్బులు చెల్లించి చూడాల్సి ఉంటుంది. ధర రూ. 199 గా నిర్ణయించారు. ఇటీవల కేజీఎఫ్ 2 (KGF 2) చిత్రాన్ని ఇలాగా రెంటల్ విధానంలో విడుదల చేశారు. కొద్ది రోజుల తర్వాత సాధారణ చందాదారులకు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు సర్కారువారి పాట చిత్రానికి కూడా అదే విధానాన్ని అమలు చేస్తున్నారని అర్ధమవుతోంది. థియేటర్స్ లో ఇంకా ఆడుతున్న ఈ సినిమాకి డిజిటల్ ప్లాట్ పామ్ పై ఎలాంటి స్పందన లభిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. మరి ఈ సినిమాను పే ఫర్ వ్యూ విధానంలో ఎంత మంది వీక్షిస్తారో చూడాలి.  



Updated Date - 2022-06-02T20:35:48+05:30 IST