Saipallavi : వైరల్ అవుతోన్న ట్యాంగో ఫెస్ట్ డ్యాన్స్ వీడియో

ABN , First Publish Date - 2022-06-21T17:58:07+05:30 IST

దక్షిణాది టాలెంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లో సాయిపల్లవి (Saipallavi) పేరు ముందు వరుసలో ఉంటుంది. గ్లామర్‌కు ప్రాధాన్యతనివ్వకుండా.. కేవలం పెర్ఫార్మెన్స్‌తోనే కథానాయికగా అగ్రతాంబూలం అందుకుంటోంది. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) ‘ఫిదా’ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి.. తెలుగువారిని భానుమతిగా మెప్పించింది ఆమె.

Saipallavi : వైరల్ అవుతోన్న ట్యాంగో ఫెస్ట్ డ్యాన్స్ వీడియో

దక్షిణాది టాలెంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లో సాయిపల్లవి (Saipallavi) పేరు ముందు వరుసలో ఉంటుంది. గ్లామర్‌కు ప్రాధాన్యతనివ్వకుండా.. కేవలం పెర్ఫార్మెన్స్‌తోనే కథానాయికగా అగ్రతాంబూలం అందుకుంటోంది. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) ‘ఫిదా’ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి.. తెలుగువారిని భానుమతిగా మెప్పించింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుకుంది. అటు తమిళనాటా అద్భుతమైన నటీమణిగా పేరు తెచ్చుకుంది.  గతేడాది నాగచైతన్య ‘లవ్ స్టోరీ (Love Story), శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy)’ చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న సాయిపల్లవి.. ఈ ఏడాది ‘విరాటపర్వం’ (Virataparvam) చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో అభినయ పరంగా వెన్నెల కురిపించింది. ఈ చిత్రంలో ఆమె నటన, ఎమోషన్స్ ప్రేక్షకుల్ని కదిలిస్తున్నాయి.


ఇక సాయిపల్లవికున్న మరో టాలెంట్ డ్యాన్స్. ఇప్పటివరకూ ఆమె నటించిన చిత్రాల్లోని పాటలు.. ఆమె డ్యాన్స్ వల్లనే యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తెచ్చుకున్నాయి. ‘ఫిదా’ (Fida) లో ‘వచ్చిండే, హేపిల్లగాడా’, లవ్ స్టోరీలో ‘సారంగదరియా’.. ‘శ్యామ్ సింగరాయ్’ లో ప్రణవలయ లాంటి పాటలు ఆమె డ్యాన్స్ టాలెంట్ కు నిదర్శనాలు. అసలు సాయిపల్లవి డ్యాన్స్ చేస్తుంటే నెమలి ఆడుతున్నట్టుందని అభిమానులు చెప్పుకుంటూంటారు. ఆమె డ్యాన్స్ కు ప్రత్యేకించి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో సాయిపల్లవి.. అద్భుతంగా నర్తించిన ఓ పాత వీడియో ప్రస్తుతం టాలీవుడ్ లో తెగ ట్రెండింగ్ అవుతోంది. 


కథానాయికగా 2015లో వచ్చిన ‘ప్రేమమ్’ (Premam) మలయాళ చిత్రంతో దక్షిణాదిన పరిచయం అయింది సాయిపల్లవి. అయితే అంతకన్నా ముందు 2013లో ఆమె ట్యాంగో ఫెస్టివల్ (Tango Festival) లో ఆమె చేసిన సల్సా డ్యాన్స్ చూపరుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. అకాకీ అవలియానీ (Akaki Avaliani) అనే డ్యాన్సర్ తో రెడ్ డ్రెస్ లో సాయిపల్లవి చేసిన డ్యాన్స్ చూడముచ్చటగా ఉంది. అభిమానుల్ని తన నాట్యంతో ఫిదా చేసేసింది సాయిపల్లవి. ఈ వీడియోకు యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ వచ్చాయి. ఇంకా వస్తునే ఉన్నాయి. ఇంత టాలెంటెడ్ గల డ్యాన్సర్ ను సౌత్ లో ఈ మధ్యకాలంలో చూడలేదని చెప్పుకుంటున్నారు. 




Updated Date - 2022-06-21T17:58:07+05:30 IST