అందం గురించి ప్రశ్నించిన నెటిజన్.. Sai Pallavi ఆసక్తికర సమాధానం!

ABN , First Publish Date - 2021-11-02T21:14:49+05:30 IST

తన అద్భుత నటనతో, డ్యాన్స్‌తో దక్షిణాది భాషలన్నింటిలోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది సాయిపల్లవి.

అందం గురించి ప్రశ్నించిన నెటిజన్.. Sai Pallavi ఆసక్తికర సమాధానం!

తన అద్భుత నటనతో, డ్యాన్స్‌తో దక్షిణాది భాషలన్నింటిలోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది సాయిపల్లవి. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్రలు అంగీకరించని సాయిపల్లవిని నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. మేకప్ లేకుండా నటించే సాయిపల్లవి తన సహజ సౌందర్యంతోనే అభిమానులను ఆకట్టుకుంటోంది. స్కిన్ టోన్, పొడవైన జుట్టు సాయిపల్లవికి అదనపు ఆకర్షణలు. తాజాగా సాయిపల్లవి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. 


ఆ సందర్భంగా ఓ అభిమాని.. సాయిపల్లవి అందం కాపాడుకునేందుకు తీసుకునే జాగ్రత్తలేంటని ప్రశ్నించాడు. స్కిన్ టోన్, పొడవైన జుట్టును కాపాడుకునేందుకు ఏం చేస్తారని అడిగాడు. దానికి సాయిపల్లవి స్పందిస్తూ.. `మీ అందరికీ తెలుసు.. వారానికి కనీసం మూడ్రోజుల వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, కూరగాయలు, పండ్లు అధికంగా తినడం. అయితే నా అనుభవంలో నేను తెలుసుకున్నదేమిటంటే.. మీరు మానసిక ఒత్తిడిలో కనుక ఉంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఉపయోగం ఉండదు. కాబట్టి మీ మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి సారించండి. అది కూడా చాలా అవసరం` అని సాయిపల్లవి పేర్కొంది.   

Updated Date - 2021-11-02T21:14:49+05:30 IST