Saif Ali Khan: ‘ఆదిపురుష్’ లో సైఫ్ లుక్‌పై ట్రోల్స్.. మహాభారతంలో నటించాలని ఉందంటున్న స్టార్..

ABN , First Publish Date - 2022-10-07T20:35:25+05:30 IST

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటించిన సినిమా ‘ఆది‌పురుష్’ (Adipurush). రామాయణాన్ని ఆధారంగా చేసుకుని మూవీని రూపొందించారు.

Saif Ali Khan: ‘ఆదిపురుష్’ లో సైఫ్ లుక్‌పై ట్రోల్స్.. మహాభారతంలో నటించాలని ఉందంటున్న స్టార్..

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటించిన సినిమా ‘ఆది‌పురుష్’ (Adipurush). రామాయణాన్ని ఆధారంగా చేసుకుని మూవీని రూపొందించారు. రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఓం రౌత్ (Om Raut) దర్శత్వం వహించాడు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ (Kriti Sanon), రావణాసురుడిగా సైఫ్‌అలీ ఖాన్ (Saif Ali Khan) నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అక్టోబర్ 2న అయోధ్యలో టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రావణాసురుడిగా నటించిన సైఫ్ లుక్‌ను ప్రేక్షకులు విపరీతంగా ట్రోల్ చేశారు. 


‘ఆదిపురుష్’ లోని రావణాసురుడు మొఘల్ చక్రవర్తులైన బాబర్, తైమూర్, ఔరంగజేబు మాదిరిగా కనిపిస్తున్నాడని అనేక మంది ట్రోల్ చేశారు. ఈ విమర్శలు ఏ విధంగా ఉన్నప్పటికి.. మరో ఇతిహాసం మహాభారతం‌ (Mahabharatam)లో నటించాలని తనకుందని సైఫ్ అలీఖాన్ తెలిపాడు. ‘‘మా తరానికి మహాభారతం కలల ప్రాజెక్టు. అజయ్ దేవగణ్‌తో ఎన్నో ఏళ్లుగా ఈ సినిమా గురించి చర్చిస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ ఇతిహాసంలో నటించాలనుకుంటారు. బాలీవుడ్, సౌత్ కలిస్తే ఈ మూవీ తప్పక నిర్మితమవుతుంది. ‘లార్డ్ ఆఫ్ ద రింగ్స్’ మాదిరిగా మహాభారతాన్ని ఎవరైనా నిర్మిస్తే బాగుంటుంది. భారతంలో నాకు నటించాలని ఉంది’’ అని సైఫ్ అలీఖాన్ తెలిపాడు. ఇక సైఫ్ అలీఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. ‘విక్రమ్ వేద’ లో చివరగా నటించాడు. విక్రమ్ పాత్రలో కనిపించాడు. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదలైంది. తమళ్‌లో హిట్ అయిన ‘విక్రమ్ వేద’ ను హిందీలో అదే పేరుతో రీమేక్ చేశారు. ఒరిజినల్‌కు దర్శకత్వం వహించిన పుష్కర్-గాయత్రినే రీమేక్‌ను తెరకెక్కించారు.  

Updated Date - 2022-10-07T20:35:25+05:30 IST