సాయిధరమ్‌తో సంయుక్త

Twitter IconWatsapp IconFacebook Icon
సాయిధరమ్‌తో సంయుక్త

‘భీమ్లా నాయక్‌’ చిత్రంలో మెరిశారు సంయుక్త మీనన్‌. చిన్న పాత్రే అయినా, ఆమె నటన గుర్తుండిపోతుంది. ఇప్పుడు తెలుగులో ఆమెకు మంచి ఆవకాశాలే వస్తున్నాయి. తాజాగా సాయిధరమ్‌ తేజ్‌ సరసన నటించే ఆఫర్‌ వచ్చిందని టాక్‌. తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘వినోదాయ శీతం’. తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడు. సాయిధరమ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో సాయిధరమ్‌కి జోడీగా సంయుక్త మీనన్‌ని ఎంచుకొన్నారని తెలుస్తోంది. సముద్రఖని దర్శకత్వం వహిస్తారు. జులైలో చిత్రీకరణ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు అందిస్తున్నారు. ఇప్పటికే స్ర్కిప్టు వర్క్‌ పూర్తయినట్టు సమాచారం. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలుస్తాయి. 


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.