Virata Parvam: అడవి తల్లి ఒడిలో ఒకసారి.. అతని ప్రేమలో మరొకసారి!

ABN , First Publish Date - 2022-05-09T23:43:22+05:30 IST

రానా దగ్గుబాటి (Rana Daggubati), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా వేణు ఊడుగుల (Venu Udugula) దర్శకత్వంలో రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం ‘విరాటపర్వం’ (Virata Parvam). డి. సురేష్ బాబు

Virata Parvam: అడవి తల్లి ఒడిలో ఒకసారి.. అతని ప్రేమలో మరొకసారి!

రానా దగ్గుబాటి (Rana Daggubati), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా వేణు ఊడుగుల (Venu Udugula) దర్శకత్వంలో రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం ‘విరాటపర్వం’ (Virata Parvam). డి. సురేష్ బాబు (D Suresh Babu) సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ (Sri Lakshmi Venkateswara Cinemas) పతాకంపై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. జూలై 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. తాజాగా సాయి పల్లవి పుట్టినరోజు(మే 9)ను పురస్కరించుకుని.. వెండితెర వెన్నెల సాయి పల్లవికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ ‘సోల్ ఆఫ్ వెన్నెల’ (Soul Of Vennela) పేరుతో ఒక ప్రత్యేకమైన వీడియోని విడుదల చేసింది. ‘విరాట పర్వం’ చిత్రంలో సాయి పల్లవి పోషించిన వెన్నల పాత్రని ఉద్దేశించి విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


‘‘వెన్నెల రెండుసార్లు జన్మించింది

తొలిపొద్దులో ఇప్పపూలు పూసినట్టు

అడవి తల్లి ఒడిలో ఒకసారి..

ఆశయాన్ని ఆయుధం  చేసినట్టు

అతని ప్రేమలో మరొకసారి...’’ అంటూ సాయి పల్లవి వెన్నెల పాత్రపై దర్శకుడు వేణు ఊడుగుల రాసిన ఈ మాటలు సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి.


‘‘నిర్బంధాలని కౌగలించుకున్న వసంతకాలం మనది.

రేపు మనం వున్నా లేకపోయినా.. చరిత్ర (History) వుంటుంది, మన ప్రేమ కథ (Love Story)ని వినిపిస్తుంది’’ అంటూ సాయి పల్లవి వాయిస్‪లో చివర్లో వినిపించిన ఈ మాటలు కవితాత్మకంగా ఉండటంతో పాటు ప్రేమకథలోని లోతుని, గొప్పతనాన్ని వెల్లడిస్తున్నాయి. ఈ స్పెషల్ వీడియోలో చూపించిన విజువల్స్.. విరాటపర్వంలో సాయి పల్లవి పాత్ర వైవిధ్యభరితంగా తెరకెక్కినట్లుగా తెలియజేస్తుంది. నిజంగా సాయిపల్లవి అభిమానులకు ఈ వీడియో కానుక వంటిదనే చెప్పుకోవచ్చు. అలాగే సురేష్ బొబ్బిలి (Suresh Bobbili) అందించిన బ్యాక్‪గ్రౌండ్ స్కోర్ మ్యాజికల్‪గా వుంది. కాగా.. ఈ చిత్రంలో ప్రియమణి (Priyamani), నందితా దాస్ (Nanditha Das), నవీన్ చంద్ర (Naveen Chandra), జరీనా వహాబ్ (Zareena Wahab), ఈశ్వరీ రావ్ (Eswari Rao), సాయిచంద్ (Sai Chand) ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

Updated Date - 2022-05-09T23:43:22+05:30 IST