తూము సరళ కుటుంబాన్ని చూసి.. గుండె బరువెక్కింది: Sai Pallavi

ABN , First Publish Date - 2022-06-18T23:28:59+05:30 IST

రానా దగ్గుబాటి (Rana Daggubati), సాయిప‌ల్లవి (Sai Pallavi) జంట‌గా.. వేణు ఊడుగుల (Venu Udugula) ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాట‌ప‌ర్వం’ (Virata Parvam). 1990లో తూము సరళ (Toomu Sarala) అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన యధార్ధ సంఘటనల ఆధారంగా..

తూము సరళ కుటుంబాన్ని చూసి.. గుండె బరువెక్కింది: Sai Pallavi

రానా దగ్గుబాటి (Rana Daggubati), సాయిప‌ల్లవి (Sai Pallavi) జంట‌గా.. వేణు ఊడుగుల (Venu Udugula) ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాట‌ప‌ర్వం’ (Virata Parvam). 1990లో తూము సరళ (Toomu Sarala) అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన యధార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. డి. సురేష్ బాబు (D Suresh Babu) స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ (SLV Cinemas) ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మించిన ఈ చిత్రం.. జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. ప్రేక్షకుల నుండి సినిమాకు భారీ ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో చిత్ర బృందంతో పాటు.. సరళ అన్నయ్య  తూము మోహన్ రావు (Toomu Mohan Rao) కూడా పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘‘తూము మోహన్ రావు‌గారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. వారి ఇంటికి వెళ్లి కలిసినపుడు నన్ను ఆశీర్వదించి చీర బొట్టు పెట్టి దీవించారు.  సరళ గారి కుటుంబాన్ని చూసిన తర్వాత గుండె బరువెక్కింది. కన్నీళ్లు వచ్చాయి. గొప్ప మనసు వున్న వాళ్ళు మళ్ళీ పుడతారు.. వాళ్ళు ఏం అనుకున్నారో.. అది ఇంకో మార్గంలో సాధించుకుంటారని చెప్పా. ఈ రోజు మోహన్ రావు గారు ఇక్కడి వచ్చి సినిమా విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడం ఆనందంగా వుంది. సురేష్ బాబు‌గారు ఒక ఎన్సైక్లోపీడియా. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. వెన్నెల పాత్ర పోషించినందుకు చాలా గర్వంగా ఫీలౌతున్నా. ప్రేక్షకులు సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తున్నామని, చూసిన ప్రతిసారి ఇంకా గొప్పగా అనిపిస్తుందని చెప్పడం ఆనందంగా వుంది. సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూడండి. చూసిన ప్రతిసారి కొత్త అనుభూతిని పొందుతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు..’’ అన్నారు. (Virata Parvam Succes Meet)

Updated Date - 2022-06-18T23:28:59+05:30 IST