బాలీవుడ్‌ ఎంట్రీపై ఆరాటపడడం లేదు: సాయిపల్లవి

ABN , First Publish Date - 2021-12-31T03:42:16+05:30 IST

తెలుగు, తమిళ చిత్రసీమల్లో ప్రత్యేక క్రేజ్‌తో పాటు గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్‌ సాయిపల్లవి బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ

బాలీవుడ్‌ ఎంట్రీపై ఆరాటపడడం లేదు: సాయిపల్లవి

తెలుగు, తమిళ చిత్రసీమల్లో ప్రత్యేక క్రేజ్‌తో పాటు గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్‌ సాయిపల్లవి బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ, ఈ వార్తలపై ఆమె ఎప్పుడూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ హీరో నానితో కలిసి ‘శ్యామ్‌ సింగరాయ్‌’ అనే మూవీలో దేవదాసి పాత్రలో సాయిపల్లవి అద్భుతంగా నటించింది. ఈ చిత్రంలో ఆమె నటనను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.


కోల్‌కతా నేపథ్యంలో సాగే ఈ కథ ఉత్తర భారతీయులకు బాగా కనెక్ట్‌ అయ్యిందని, సాయిపల్లవి గురించి ఉత్తరాది ప్రేక్షకులు కూడా మాట్లాడుకుంటున్నారనేలా టాక్ నడుస్తోంది. దీంతో ఆమె బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుందనే ప్రచార జోరు ఎక్కువైంది. అయితే  ఈ వార్తలపై ఆమె తాజాగా స్పందిస్తూ ‘బాలీవుడ్‌ చిత్రాల్లో నటించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అయితే స్ర్కిప్టు ఎంతో ముఖ్యం. పైగా ఇప్పటికిప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టలేను. నాకు మంచి కథతో పాటు కథాపాత్ర ఎంతో అవసరం’ అని వివరించింది. 

Updated Date - 2021-12-31T03:42:16+05:30 IST