NTR30: ఇద్దరు మహానటుల కలయిక.. ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్సే!

ABN , First Publish Date - 2022-05-27T03:06:33+05:30 IST

కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (Young Tiger NTR) ఓ సినిమా చేయబోతోన్న విషయం తెలిసిందే. NTR30 అనే వర్కింగ్ టైటిల్‌తో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా

NTR30: ఇద్దరు మహానటుల కలయిక.. ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్సే!

కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (Young Tiger NTR) ఓ సినిమా చేయబోతోన్న విషయం తెలిసిందే. NTR30 అనే వర్కింగ్ టైటిల్‌తో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను.. తారక్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేయగా.. అది సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఎన్టీఆర్ వాయిస్ మరియు అనిరుద్ (Anirudh) మ్యూజిక్ అందరినీ స్పెల్ బౌండ్ చేశాయి. ఇదిలా ఉంటే ఈ పాన్ ఇండియా (Pan India) ప్రాజెక్ట్‌లో హీరోయిన్ విషయంలో ఇప్పటికే చాలా రూమర్స్ వినిపించాయి. తాజాగా కొరటాల శివ, ఎన్టీఆర్ పక్కన నటించడానికి డాన్సింగ్ క్వీన్ సాయిపల్లవి (Sai Pallavi)ని ఫైనల్ చేశాడనే వార్త బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కూడా బలంగా ఉంటుందని, అందుకే సాయిపల్లవి అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. 


సాయిపల్లవి గ్లామర్ పాత్రలకి దూరంగా ఉంటుంది కానీ.. నటన పరంగా, ఇప్పుడున్న హీరోయిన్స్‌లో ది బెస్ట్ పెర్ఫర్మార్ తను. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు, అలాగే తెరపై సాయిపల్లవి డాన్స్ చేస్తుంటే నెమలి నాట్యం చేస్తున్నట్లు ఉంటుంది. ఇప్పటికే ఈ విషయాన్ని సాయిపల్లవి డాన్స్ చాలా సార్లు ప్రూవ్ చేసింది. ఎన్టీఆర్ వంటి స్టార్ నటుడి ముందు యాక్ట్ చేయలన్నా, ఆయనతో కలిసి డాన్స్ చేయలన్నా ఒక రేంజ్ టాలెంట్ ఉండాలి. సాయిపల్లవి ఆ విషయంలో తారక్‌కి సరిజోడీ అని చెప్పుకోవచ్చు. సో ఈ కాంబో సెట్ అయితే మాత్రం ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ గ్యారెంటీ.

Updated Date - 2022-05-27T03:06:33+05:30 IST