Sai pallavi: లేడీ పవర్ స్టార్.. ఒత్తిడితో కూడినది

ABN , First Publish Date - 2022-06-21T00:04:26+05:30 IST

‘‘పేరుకు ముందు ట్యాగ్స్‌ పెట్టి పిలవడం కరెక్ట్‌ కాదని నా భావన. అలాంటి వాటికి నేను కనెక్ట్‌ కాలేను. నా పాత్రల ద్వారా ప్రేక్షకులు నాపై చూపించ్రేపేమ చాలు. వాళ్ల ప్రేమను దృష్టిలో ఉంచుకుని మరిన్ని మంచి పాత్రలు చేయాలి. ఇలాంటి ట్యాగ్స్‌ని భుజాన వేసుకుంటే ఒత్తిడికి గురై సరిగ్గా నటించలేను’’ అని సాయి పల్లవి (Sai pallavi) అంటున్నారు. సినీ ప్రముఖులతోపాటు అభిమానులు ఆమెకు లేడీ పవర్‌స్టార్‌ అనే ట్యాగ్‌ ఇచ్చారు.

Sai pallavi: లేడీ పవర్ స్టార్.. ఒత్తిడితో కూడినది

‘‘పేరుకు ముందు ట్యాగ్స్‌ పెట్టి పిలవడం కరెక్ట్‌ కాదని నా భావన. అలాంటి వాటికి నేను కనెక్ట్‌ కాలేను. నా పాత్రల ద్వారా ప్రేక్షకులు నాపై చూపించ్రేపేమ చాలు. వాళ్ల ప్రేమను దృష్టిలో ఉంచుకుని మరిన్ని మంచి పాత్రలు చేయాలి. ఇలాంటి ట్యాగ్స్‌ని భుజాన వేసుకుంటే ఒత్తిడికి గురై సరిగ్గా నటించలేను’’ అని సాయి పల్లవి (Sai pallavi) అంటున్నారు. సినీ ప్రముఖులతోపాటు అభిమానులు ఆమెకు లేడీ పవర్‌స్టార్‌ అనే ట్యాగ్‌ ఇచ్చారు. అంటే ఆమెకు అభిమానగణం ఎంతగా ఉందో అర్థమవుతోంది. ప్రస్తుతం ఆమెను అంతా లేడీ పవర్‌స్టార్‌ అని పిలుస్తున్నారు. ‘విరాట పర్వం’ ప్రీ రిలీజ్‌ వేడుకలో వేసిన ఆడియో విజువల్స్‌లో కూడా లేడీ పవర్‌స్టార్‌ అని ప్రస్తావించడంతో సాయి పల్లవి ఆశ్చర్యానికి గురైంది. దీని గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడారు.


‘‘పేరుకు ముందు ఇలాంటి ట్యాగ్స్‌ పెట్టుకోవడం కరెక్ట్‌ కాదు. ‘ఫిదా’ నుంచి ‘విరాటపర్వం’ వరకూ  నేను పోషించే పాత్రలు ప్రేక్షకులకు కనెక్ట్‌ కావడం వల్లే  అభిమానులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. వాళ్ల ప్రేమను దృష్టిలో ఉంచుకుని మరిన్ని మంచి పాత్రల్లో నటించాలి. ఇలాంటి ట్యాగ్స్‌ని తలకెత్తుకుంటే ఒత్తిడికి గురై.. సరిగ్గా నటించలేను కాబట్టి నేను సాధారణంగా ఉండటానికే ఇష్టపడతాను’’ అని సాయి పల్లవి తెలిపారు. ఆమె కీలక పాత్రలో నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ‘విరాట పర్వం’ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తుంది. (Lady power star tag for sai pallavi)




Updated Date - 2022-06-21T00:04:26+05:30 IST