ఇక్కడ అంత సీన్ లేదండీ: Sai Pallavi

ABN , First Publish Date - 2022-06-05T21:23:58+05:30 IST

గత ఏడాది నుంచి పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ‘విరాటపర్వం’ (Virataparvam) సినిమా ఎట్టకేలకు ఈ నెల 17వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.

ఇక్కడ అంత సీన్ లేదండీ: Sai Pallavi

గత ఏడాది నుంచి పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ‘విరాటపర్వం’ (Virataparvam) సినిమా ఎట్టకేలకు ఈ నెల 17వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వదులుతున్నారు. రానా (Rana), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా కలిసి నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ వేణు ఊడుగుల (Venu Udugula) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. ఈ నివేతా పేతురాజ్, ప్రియమణి, నందితా దాస్ కీలక పాత్రల్లో నటించారు.


అయితే, ఈరోజు ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ఓ వీడియోను విడుదల చేసి వెల్లడించారు. ఈ వీడియో చాలా కొత్తగా ఉంది. అందరినీ ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అభిమాని రానా ఆఫీస్ వద్దకు వెళతాడు. అప్పుడే రానా బయటకు రాగానే 'విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ ఏవీ'.. అని అడుగుతాడు. 'నేను సాయి పల్లవి అభిమానిని..ఆమెను చూడాలి వెయిట్ చేస్తున్నా' అని చెబుతాడు.


దీనికి రానా సమాధానమిస్తూ ..'నేను కూడా సాయి పల్లవి అభిమానిని..ఆమె కోసమే ఈ సినిమా తీశాము. సాయి పల్లవి ఫ్యాన్స్ కోసం కర్నూలులో ఈ 5వ తేదీన ట్రైలర్‌ను రిలీజ్ చేసున్నాము. ఈ ఈవెంట్‌కు ఆమె కూడా వస్తున్నారు'.. అని అంటారు రానా. ఈ ప్రమోషనల్ వీడియోను సాయి పల్లవి చూసి 'ఇక్కడ అంత సీన్ లేదండీ..ప్రజల ప్రేమను పొందుతున్న నేనే అదృష్టవంతురాలిని. కర్నూలులో వాళ్ళందరినీ చూసేందుకు నేను కూడా ఎదురుచూస్తున్నా'.. అని పోస్ట్‌లో తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, డి.సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 



Updated Date - 2022-06-05T21:23:58+05:30 IST