Sai Dharm Tej: ఆయన మీకు పవర్ స్టార్.. నాకు మాత్రం గురువుగారు

ABN , First Publish Date - 2022-08-31T16:06:54+05:30 IST

వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) తాజాగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'రంగ రంగ వైభవంగా' (Ranga Ranga Vaibhavanga).

Sai Dharm Tej: ఆయన మీకు పవర్ స్టార్.. నాకు మాత్రం గురువుగారు

వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) తాజాగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'రంగ రంగ వైభవంగా' (Ranga Ranga Vaibhavanga). ఈ సినిమా సెప్టెంబర్ 2న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. విశేషం ఏమిటంటే అదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు. ఇది మెగా అభిమానులకు పెద్ద పండుగ అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్‌లో ఘనంగా నిర్వహించారు. 


ఈ గ్రాండ్ ఈవెంట్‌కి సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej), వరుణ్ తేజ్ (Varun Tej) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. " 2021 మాకు చాలా లక్కీ ఇయర్. వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమాతో పరిచయమయ్యాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. వైష్ణవ్‌ను మీరు హీరోగా అంగీకరించారు .. నిజంగా మా అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించిన విషయం. దీనికి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెబుతున్నాను.  


సెప్టెంబర్ 2న 'రంగ రంగ వైభవంగా' సినిమా రిలీజ్ మాత్రమే కాదు.. అంతకంటే పెద్ద పండగ ఉంది"..అని అన్నారు. ఇదే సమయంలో తన మావయ్య పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, "ఆయన మీకు పవర్ స్టార్.. నాకు మాత్రం గురువుగారు. అందుకే, ఆ రోజు ఈ సినిమాను చూసి గురువుగారి బర్త్ డే పార్టీ సెలబ్రేట్ చేసుకోండి"..అని చెప్పుకొచ్చారు. కాగా, బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి గిరీశాయ దర్శకత్వం వహించాడు. కేతిక శర్మ హీరోయిన్..దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. 

Updated Date - 2022-08-31T16:06:54+05:30 IST