Bheemla Nayak: డైరెక్టర్‌.. నెక్ట్స్‌ ఏంటి?

ABN , First Publish Date - 2022-09-24T00:24:25+05:30 IST

‘భీమ్లానాయక్‌’ సక్సెస్‌తో స్టార్‌ దర్శకుల జాబితాలో చేరారు దర్శకుడు సాగర్‌.కె.చంద్ర. అయితే ఆ చిత్రం తర్వాత ఆయన్నుంచీ కొత్త సినిమా విశేషాలేమీ బయటకు రాలేదు.

Bheemla Nayak: డైరెక్టర్‌.. నెక్ట్స్‌ ఏంటి?

‘భీమ్లానాయక్‌’(BHeemla nayak) సక్సెస్‌తో స్టార్‌ దర్శకుల జాబితాలో చేరారు దర్శకుడు సాగర్‌.కె.చంద్ర(Sagar k chandra). అయితే ఆ చిత్రం తర్వాత ఆయన్నుంచీ కొత్త సినిమా విశేషాలేమీ బయటకు రాలేదు. ఇద్దరు యంగ్‌ హీరోలకు కథలు రాసే పనిలో సాగర్‌ ఉన్నారని టాక్‌ వినిపిస్తోంది. అందులో ఓ హీరో బెల్లంకొండ సాయి(Bellamkonda sai srinivas). సాగర్‌, సాయికి మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ చనువుతో హీరో సాయి శ్రీనివాస్‌ సాగర్‌ చంద్రను ఓ కథ సిద్ధం చేయమని చెప్పినట్లు చాలాకాలంగా టాక్‌ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. సాగర్‌ సిద్ధం చేస్తున్న కథ సాయి కోసం కాదని తెలిసింది. మరో యంగ్‌ హీరో నితిన్‌(Nithin)తో తదుపరి చిత్రం ఉంటుందని హీరో సన్నిహితుల నుంచి సమాచారం అందింది. ఇప్పటికే కథా చర్చలు ముగిశాయని. ఫైనల్‌ సిట్టింగ్‌ పూర్తయితే ఓ పది రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలిసింది. 


గత మూడేళ్లగా వరుసగా సినిమాలు చేస్తున్న నితిన్‌ సరైన విజయం ఒకటీ అందుకోలేకపోయారు. తాజాగా విడుదలైనన ‘మాచర్ల నియోజక వర్గం’ కూడా అంచనాలు చేరుకోలేకపోయింది. మరి సాగర్‌ చంద్ర అయినా నితిన్‌ ఖాతాలో హిట్‌ వేస్తాడేమో చూడాలి. 


Updated Date - 2022-09-24T00:24:25+05:30 IST