Sachin తన గురించి చేసిన ట్వీట్‌కు... Ranveer రిప్లై ఏంటంటే...

ABN , First Publish Date - 2022-01-06T23:35:41+05:30 IST

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పొగడ్తలు కురిపించాడు. ‘83’ సినిమాతో అద్భుతమైన రివ్యూలు పొందిన రణవీర్‌ను ఆయన బుధవారం నాడు ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. ట్విట్టర్‌లో రణవీర్ ‘83’ మూవీ స్టిల్ షేర్ చేసిన సచిన్ ‘‘కపిల్ పాజీ లక్షణాలు, హావభావాలు... అన్నీ రణవీర్ పుణికిపుచ్చుకోగలిగాడు!’’ అన్నాడు.

Sachin తన గురించి చేసిన ట్వీట్‌కు... Ranveer రిప్లై ఏంటంటే...

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పొగడ్తలు కురిపించాడు. ‘83’ సినిమాతో అద్భుతమైన రివ్యూలు పొందిన రణవీర్‌ను ఆయన బుధవారం నాడు ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. ట్విట్టర్‌లో రణవీర్ ‘83’ మూవీ స్టిల్ షేర్ చేసిన సచిన్ ‘‘కపిల్ పాజీ లక్షణాలు, హావభావాలు... అన్నీ రణవీర్ పుణికిపుచ్చుకోగలిగాడు!’’ అన్నాడు. 


‘‘అద్భుతమైన ‘ఆల్-రౌండ్’ ప్రదర్శన’’ అంటూ రణవీర్ సింగ్‌కు కితాబునిచ్చిన టెండూల్కర్... ‘83’ సినిమా చూస్తుంటే భారతదేశపు మొట్ట మొదటి ప్రపంచ కప్ విజయం తాలూకూ చారిత్రక క్షణాలు కళ్ల ముందు కదలాడాయని అన్నాడు. అంతే కాదు, ట్వీట్ చివర్లో ‘‘ఆ ఘనవిజయం అప్పటి ఆ కుర్రాడ్ని ఎంతగానో ప్రేరేపించిందని కూడా నాకు తెలుసు...’’ అని చెప్పాడు. ఆయన తన గురించి తానే అలా చెప్పుకున్నాడు!


‘గాడ్ ఆఫ్ క్రికెట్‌’గా కీర్తింపబడ్డ సచిన్ లాంటి లెజెండ్ తనని పొగిడితే... రణవీర్ రిప్లై ఇవ్వకుండా ఉండగలడా? బాలీవుడ్ సూపర్ స్టార్ ‘థాంక్యూ, మాస్టర్!’ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. మీ పొగడ్త అమూల్యం అన్నాడు. ‘‘ఆనాటి లిటిల్ బాయ్ తరువాతి కాలంలో తరతరాలకి ప్రేరణగా నిలిచిపోయాడు...’’ అంటూ టెండూల్కర్ గురించి చెప్పాడు. 


రణవీర్‌ని, సచిన్... సచిన్ను రణవీర్ పరస్పరం పొగుడుకోవటం... ఆన్‌లైన్‌లో చర్చకు కారణమైంది. ఇద్దరి అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘83’ సినిమాలో కపిల్‌గా రణవీర్ నటనపై ఇంతకు ముందు కూడా పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. 

Updated Date - 2022-01-06T23:35:41+05:30 IST