‘సురాపానం’ టీజర్ వదిలిన ‘భీమ్లా నాయక్’ డైరెక్టర్

ABN , First Publish Date - 2022-04-22T01:33:23+05:30 IST

అఖిల్ భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై సంపత్ కుమార్ దర్శకత్వం వహించి నటించిన చిత్రం ‘సురాపానం’. కిక్ అండ్ ఫన్ అనేది ట్యాగ్‌లైన్. ఈ మూవీ టీజర్‌ని గురువారం సాయంత్రం 6 గంటలకు ‘భీమ్లా నాయక్’ చిత్ర దర్శకుడు సాగర్ కె చంద్ర

‘సురాపానం’ టీజర్ వదిలిన ‘భీమ్లా నాయక్’ డైరెక్టర్

అఖిల్ భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై సంపత్ కుమార్ దర్శకత్వం వహించి నటించిన చిత్రం ‘సురాపానం’. కిక్ అండ్ ఫన్ అనేది ట్యాగ్‌లైన్. ఈ మూవీ టీజర్‌ని గురువారం సాయంత్రం 6 గంటలకు ‘భీమ్లా నాయక్’ చిత్ర దర్శకుడు సాగర్ కె చంద్ర విడుదల చేశారు. ఈ సందర్బంగా సాగర్ కె చంద్ర మాట్లాడుతూ.. టైటిల్‌కి తగ్గట్టుగా సినిమా టీజర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకుల్ని ఖచ్చితంగా ఆకట్టుకుని, మంచి థ్రిల్‌తో పాటు వినోదాన్ని అందిస్తుందని నమ్ముతూ.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.


చిత్ర దర్శకుడు సంపత్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం ఫాంటసీ థ్రిల్లర్ మరియు కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్. తెలుగు సినిమా సిల్వర్ స్ర్కీన్‌పై  మొదటిసారిగా సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే చివరి వారంలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము..’’ అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మట్ట మధు యాదవ్, మట్ట రాజు యాదవ్, మీసాల లక్ష్మణ్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-04-22T01:33:23+05:30 IST