Russo brothers: రాజమౌళి ప్రతిభ.. రూసో బ్రదర్స్‌ ప్రశంస

ABN , First Publish Date - 2022-07-30T21:04:35+05:30 IST

‘బాహుబలి’తో తెలుగు సినిమా సత్తాను ప్యాన్‌ ఇండియా స్థాయికి తీసుకెళ్లారు దర్శకధీరుడు రాజమౌళి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ప్యాన్‌ వరల్డ్‌లో కూడా గుర్తింపు తీసుకొచ్చారు. ఈ రేంజ్‌ విజయం సాధించడం వెనక చాలా కష్టమే ఉంటుంది. సినిమాకు బాగా దగ్గరగా ఉండేవారితోపాటు టెక్నిషియన్లకు మాత్రమే ఆ కష్టం ఏంటనేది తెలుస్తుంది

Russo brothers: రాజమౌళి ప్రతిభ.. రూసో బ్రదర్స్‌ ప్రశంస

‘బాహుబలి’(Bahubali)తో తెలుగు సినిమా సత్తాను ప్యాన్‌ ఇండియా స్థాయికి తీసుకెళ్లారు దర్శకధీరుడు రాజమౌళి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR)తో ప్యాన్‌ వరల్డ్‌లో కూడా గుర్తింపు తీసుకొచ్చారు. ఈ రేంజ్‌ విజయం సాధించడం వెనక చాలా కష్టమే ఉంటుంది. సినిమాకు బాగా దగ్గరగా ఉండేవారితోపాటు టెక్నిషియన్లకు మాత్రమే ఆ కష్టం ఏంటనేది తెలుస్తుంది. ‘అవెంజర్స్‌’ లాంటి క్రేజీ సిరీస్‌లను ప్రేక్షకులకు అందించిన హాలీవుడ్‌ మేకర్స్‌ రూసో బ్రదర్స్‌ (Russo brothers)జక్కన్న పని తనానికి ఫిదా అయ్యారు. ‘ద గ్రే మ్యాన్‌’ (The gray man)సినిమా ప్రమోషన్స్‌ కోసం ఇండియా వచ్చిన స్టార్‌ మేకర్స్‌ ఇటీవల రాజమౌళితో వర్చువల్‌గా సంభాషించారు. నెట్‌ఫ్లిక్స్‌ ఏర్పాటు చేసిన వర్చువల్‌ మీట్‌లో రాజమౌళి, రూసో బ్రదర్స్‌ కాసేపు మాట్లాడుకున్నారు. ఈ మేరకు హాలీవుడ్‌ మేకర్స్‌ ఓ ట్వీట్‌ చేశారు. రాజమౌళిని(Rajamouli) ప్రసంసించారు. ‘ది గ్రేట్‌’ రాజమౌళి’ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. దీనికి రాజమౌళి స్పందించారు. ‘రూసో బ్రదర్స్‌ని కలవడం ఎంతో ఆనందంగా, గౌరవంగా భావిస్తున్నాని అన్నారు. మరోసారి తమని కలిసి మీ క్రాఫ్ట్స్‌ నుంచి కొంతమేర వర్క్‌ నేర్చుకోవాలనుందని రాజమౌళి’ ట్వీట్‌ చేశారు. (russo brothers praise rajamouli)




Updated Date - 2022-07-30T21:04:35+05:30 IST