హీరోల మధ్య ట్వీట్ వార్.. హిందీలో పోస్ట్ పెట్టిన అజయ్ దేవగణ్, కన్నడలో రిప్లై ఇస్తే పరిస్థితేంటన్న సుదీప్..

ABN , First Publish Date - 2022-04-28T01:09:58+05:30 IST

దక్షిణాది సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న సంగతి తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీ నుంచి డబ్ అయిన ‘ఆర్ఆర్ఆర్’, ‘కెజియఫ్: చాప్టర్-2’ చిత్రాలు అక్కడ భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టాయి.

హీరోల మధ్య ట్వీట్ వార్.. హిందీలో పోస్ట్ పెట్టిన అజయ్ దేవగణ్, కన్నడలో రిప్లై ఇస్తే పరిస్థితేంటన్న సుదీప్..

దక్షిణాది సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న సంగతి తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీ నుంచి డబ్ అయిన ‘ఆర్ఆర్ఆర్’, ‘కెజియఫ్: చాప్టర్-2’ చిత్రాలు అక్కడ భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టాయి. ఈ నేపథ్యంలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ‘కెజియఫ్-2’ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తూ హిందీ ఎంత మాత్రం జాతీయ భాష కాదన్నాడు. సుదీప్ మాటలకు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ దీటుగా బదులిచ్చాడు. 


సుదీప్‌కు కౌంటర్ ఇస్తూ అజయ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘నా సోదరుడా.. కిచ్చా సుదీప్.. హిందీ జాతీయ భాష కాదని నువ్వు అంటున్నావు. మరి సినిమాను నీ ప్రాంతీయ భాషలో విడుదల చేయకుండా ఎందుకు హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నావు? ఇప్పుడు, ఎల్లప్పుడు హిందీ మాతృ భాష, జాతీయ భాష’’ అని అజయ్ దేవగణ్ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ట్వీట్‌కు సుదీప్ రిప్లై ఇచ్చాడు. ‘‘నేను వేరే సందర్భంలో ఈ మాటలను చెప్పాను. మీరు తప్పుగా నన్ను అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలసినప్పుడు ఆ మాటలను ఎందుకు అన్నానో నేను చెబుతాను. ఎవరినీ బాధపెట్టాలని, రెచ్చగొట్టాలని ఆ వ్యాఖ్యలు చేయలేదు. దేశంలోని ప్రతి భాష మీద నాకు గౌరవం ఉంది. ఈ టాపిక్ ఇక్కడితే ముగిసిపోతే బాగుంటుంది. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. మీరు హిందీలో చేసిన ట్వీట్ నాకు అర్థమైంది. నాకు హిందీ మీద ప్రేమ, గౌరవం ఉంది కాబట్టే నేర్చుకున్నాను. కానీ, కన్నడలో నేను రిప్లై ఇస్తే పరిస్థితి ఏంటీ అని ఆలోచిస్తున్నాను’’ అని కిచ్చా సుదీప్ ట్విట్టర్‌లో మెసేజ్ షేర్ చేశాడు.  కాసేటిపకే అజయ్ దేవగణ్ ట్విట్టర్‌లో మరో పోస్ట్ పెట్టాడు. ‘‘సుదీప్ నువ్వు నా స్నేహితుడివి. అపార్థాన్ని విడమరిచి చెప్పినందుకు ధన్యవాదాలు. సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కటే అని నేను భావిస్తాను. మేం అన్ని భాషలను గౌరవిస్తాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా అన్ని భాషలను గౌరవించాలని కోరుకుంటాం’’ అని అజయ్ మరోసారి ట్వీట్ చేశాడు. 


గత వారంలో కన్నడ హీరో సుదీప్ ఓ ఈవెంట్‌‌లో పాల్గొన్నాడు. ‘‘హిందీ ఎంత మాత్రం జాతీయ భాష కాదు. ఈ రోజు మనం తెరకెక్కిస్తున్న చిత్రాలను ప్రపంచం మొత్తం చూస్తుంది’’ అని అతడు పేర్కొన్నాడు. 











Updated Date - 2022-04-28T01:09:58+05:30 IST