RRR: ట్రైన్‌ సీక్వెన్స్‌ ఎలా తీశారో తెలుసా?

ABN , First Publish Date - 2022-05-30T23:07:04+05:30 IST

రాజమౌళి సినిమా అంటే భారీతనం, విజువల్‌ వండర్‌. కథతోపాటు ఆయన చిత్రాల్లో గ్రాఫిక్స్‌కు పెద్ద పీట వేస్తుంటారు. అందుకే జక్కన్న సినిమాలు అనుకున్న సమయానికంటే లేటుగా విడుదలవుతుంటాయి. ఈ ఏడాది ఆయన నుంచి వచ్చిన భారీ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌–రామ్‌చరణ్‌ కీలక పాత్రధారులుగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది.

RRR: ట్రైన్‌ సీక్వెన్స్‌ ఎలా తీశారో తెలుసా?

రాజమౌళి(Rajamouli) సినిమా అంటే భారీతనం, విజువల్‌ వండర్‌. కథతోపాటు ఆయన చిత్రాల్లో గ్రాఫిక్స్‌కు పెద్ద పీట వేస్తుంటారు. అందుకే జక్కన్న సినిమాలు అనుకున్న సమయానికంటే లేటుగా విడుదలవుతుంటాయి. ఈ ఏడాది ఆయన నుంచి వచ్చిన భారీ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR). ఎన్టీఆర్‌–రామ్‌చరణ్‌(Ntr-ramcharan) కీలక పాత్రధారులుగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇందులో రామ్‌చరణ్‌, తారక్‌ మొదటిసారి కలుసుకున్న సందర్భంలో చూపించే బ్రిడ్జ్‌, గూడ్స్‌ ట్రైన్‌ యాక్సిడెంట్‌ సీక్వెన్స్‌తోపాటు చుట్టు పక్కల ప్రాంతాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. వీఎఫ్‌ఎక్స్‌..(RRR VFX) అద్భుతమని అభినందిస్తున్నారు. 


సోమవారం ఈ చిత్రానికి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్‌ ఎలా క్రియేట్‌ చేశారో తెలియజేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. వంతెన సీక్వెన్స్‌ క్రియేట్‌ చేయడం కోసం డెన్మార్క్‌కు చెందిన వీఎఫ్‌ఎక్స్‌ బృందం ఎలా వర్క్‌ చేశారు. రైల్వే బ్రిడ్జ్‌, ఆ చుట్టు పక్కల గ్రామీణ వాతావరణం, నదిని క్రియేట్‌ చేయడం కోసం వీఎఫ్‌ఎక్స్‌ బృందం రాజమండ్రికి చేరుకుని గోదావరి బ్రిడ్జ్‌.. ప్రాంతానికి చేరుకుని అక్కడ పరిసరాల ఫొటోలు తీసుకున్నారు. ఆ తర్వాత డెన్మార్క్‌ చేరుకుని వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ ప్రారంభించారు. ట్రైన్‌ వీఎఫ్‌ఎక్స్‌ తదితర సన్నివేశాలు వీఎఫ్‌ఎక్స్‌లో ఎలా క్రియేట్‌ చేశారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే! 




Updated Date - 2022-05-30T23:07:04+05:30 IST