పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్కి గానూ ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారనే విషయంలో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ భారీ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి రూపొందించారు. అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య దాదాపు 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
ఇక ఇప్పటికే అన్నీ కలుపుకొని దాదాపు 900 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు సమాచారం. అయితే ఈ సినిమా కోసం ఎవరెవరు ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకున్నారో అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో కొమురం భీమ్ పాత్రను పోషించిన ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్‌ల ఒక్కొక్కరికి 45 కోట్ల చొప్పున రెమ్యునరేషన్‌గా అందినట్టు సమాచారం. అలాగే, ఈ మూవీలో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ 25 కోట్లు, అలియాభట్ 9 కోట్లవరకు అందుకున్నారట. ఇక చిత్ర దర్శకుడు రాజమౌళి రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా లాభాల్లో 30 శాతం వాటా తీసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఇందులో నటించిన మిగతా పాపులర్ నటులకు భారీగా అందినట్టు తెలుస్తోంది.